బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగా మొదలైంది. కరోనా తర్వాత మొదలైన సినిమాకు ఎలాంటి బ్రేకులు లేకుండా జరుగుతుంది. సినిమాను ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బోయపాటి. ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన సినిమాతో రాబోతున్నాడు బాలయ్య. బోయపాటి సినిమా లైన్లో ఉండగానే మరో రెండు సినిమాలకు కూడా ఈయన ఓకే చెప్పాడు. కెయస్ రవికుమార్ కూడా బాలయ్యకు కథ చెప్పి ఒప్పించాడని తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు సంచలన కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయిన సినిమాను ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ కాంబినేషన్ కానీ వర్కవుట్ అయితే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సిందేం లేదు.

బాలకృష్ణ (File/Photo)
ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో మొదలు కానుంది. కేవలం ఆర్నెళ్లలో ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు అనిల్. ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి ఈ కుర్ర దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు. ఈయన కోసం చాలా మంది హీరోలు, నిర్మాతలు వేచి చూస్తున్నారు. కానీ ఎందుకో తెలియదు కానీ బాలయ్య సినిమా చేయడం అనేది అనిల్ డ్రీమ్ అయిపోయింది. చాలా రోజులుగా కూడా ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నాడు.

వెంకీ, వరుణ్‌లతో దర్శకుడు అనిల్ రావిపూడి
అవకాశం వస్తే కచ్చితంగా నందమూరి హీరోలతో సినిమా చేస్తానని.. అందులోనూ బాలయ్యతో సినిమా చేయాలని ఉందంటూ ఇదివరకే చెప్పాడు ఈ దర్శకుడు. ఎఫ్3 తర్వాత తన డ్రీమ్ పూర్తి చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయినా ఇప్పుడు ఈయన ఉన్న ఫామ్‌కు ఏ హీరో అయినా కథ చెప్తే వద్దంటాడా చెప్పండి..? అన్నీ అనుకున్నట్లు జరిగి బాలయ్య, అనిల్ సినిమా వస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కు థియేటర్స్‌లో పూనకాలు తప్పవేమో..?
Published by:Praveen Kumar Vadla
First published:December 21, 2020, 19:08 IST