Home /News /movies /

NANDAMURI BALAKRISHNA AKHANDA MOVIE SHOOT WRAPPED AND PUMPKING BROKEN TA

Balakrishna - Akhanda Shoot Wrapped: షూటింగ్ పూర్తిచేసుకున్న బాలకృష్ణ ‘అఖండ’ మూవీ.. గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్..

బాలకృష్ణ,బోయపాటి శ్రీను ’అఖండ’ కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్ (Twitter/Photo)

బాలకృష్ణ,బోయపాటి శ్రీను ’అఖండ’ కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్ (Twitter/Photo)

Balakrishna - Akhanda Shoot Wrapped: : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు.

ఇంకా చదవండి ...
    Balakrishna - Akhanda Shoot Wrapped: : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ చిత్రాన్నికి గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్‌ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే ‘అఖండ’ మూవీ నుంచి  విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. ఈ  సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. అపుడే 25వ సినిమా కోసం భారీ స్కెచ్..

    టాలీవుడ్‌ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌ హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, తెలంగాణ (నైజాం) ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడుపోయినట్టు సమాచారం. ఇక రాయలసీమ (సీడెడ్)  హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయంతో  దసరా రోజున మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు.

    Rajinikanth - Chiranjeevi - Balakrishna : ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య నలిగిపోతున్న రజినీకాంత్..

    గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. పల్నాడు బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష  (Trisha Krishnan ) నటించనుందని తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Boyapati Srinu, NBK, Pragya jaiswal, Srikanth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు