Home /News /movies /

NANDAMURI BALAKRISHNA AKHANDA 5 WEEKS 35 DAYS WORLD WIDE COLLECTIONS TA

Akhanda 5 Weeks collections: ‘అఖండ’ 5 వారాల కలెక్షన్స్.. 35వ రోజు కూడా తగ్గని బాలయ్య జోరు..

బాలకృష్ణ ‘అఖండ’ 5 వారాల కలెక్షన్స్ (Twitter/Photo)

బాలకృష్ణ ‘అఖండ’ 5 వారాల కలెక్షన్స్ (Twitter/Photo)

Akhanda 5 Weeks collections: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ సినిమా 5 వారాల కలక్షన్స్ విషయానికొస్తే..

    Akhanda 5 Weeks collections: నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా 35 రోజులు గడిచినా కూడా ‘అఖండ’ ఇంకా  బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు.  అఖండ సినిమా 5 వారాల్లో రూ. 72. 27 కోట్లకు పైగా షేర్ (127.10 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

    విడుదలైన రోజు కూడా రూ. 12 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ.  మొత్తంగా 5వ వారంలో అఖండ మూవీ మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.66 కోట్లు వసూళు చేసింది.  బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా 25 రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు.

    RRR : చిక్కుల్లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన యువతి..

    అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ 6వ వారంలోకి ఎంటర్ అయ్యి ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఈ సినిమా 30వ రోజు 10 లక్షల షేర్‌ని సాధిస్తే 31వ రోజు న్యూ ఇయర్ అవ్వడంతో అఖండ నైజాంలో 26 లక్షలు, సీడెడ్ లో 19 లక్షలు, ఆంధ్రలో 15 లక్షల వరకు షేర్‌ను సాధించి కేక పెట్టించింది.ఇక 32వ రోజు.. రూ. 45లక్షలు.. 33వ రోజు.. రూ. 16 లక్షలు.. 34వ రోజు.. రూ. 14 లక్షలు.. 35వ రోజు.. రూ. 12 లక్షల షేర్ సాధించింది.  ఈ అఖండ సినిమా మొత్తంగా 35వ రోజుతో కలిపి ఎంత రాబట్టిందంటే.. ఈ సినిమా 35 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

    6వ వారంలో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ‘అఖండ’ (Twitter/Photo)


    నైజాం(తెలంగాణ) : రూ. 20.54 కోట్లు (వచ్చింది)/ రూ. 10.5 కోట్లు (అమ్మింది)
    సీడెడ్ (రాయలసీమ): రూ. 15.53 కోట్లు / రూ. 10.6 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.6.21 కోట్లు / రూ. 6 కోట్లు
    ఈస్ట్:రూ. 4.19 కోట్లు / రూ.4.00 కోట్లు
    వెస్ట్: రూ.4.15 కోట్లు / రూ.3.5 కోట్లు
    గుంటూరు:రూ. 4.73 కోట్లు /రూ. 5.4 కోట్లు
    కృష్ణా: 3.61 కోట్లు /రూ. 3.7 కోట్లు
    నెల్లూరు: రూ.2.61 కోట్లు /రూ. 1.8 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: రూ. 61.57 కోట్లు / రూ. 45.50
    ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.10.70 కోట్లు / రూ.7.5 కోట్లు
    టోటల్ వరల్డ్ వైడ్ 25 డేస్ కలెక్షన్స్: రూ.72.27 కోట్లు షేర్ (రూ. 127.10 కోట్ట గ్రాస్ వసూళ్లు)  రూ.53 కోట్లు..

    బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ మరో రికార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
     అఖండ సినిమాకు ఇంత కలెక్షన్స్ ప్రభంజనం కురిసినా కూడా ఇప్పటికీ రెండు చోట్ల సినిమా సేఫ్ అవ్వలేదు. టోటల్‌గా గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన చోట్ల మాత్రం అఖండకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.రూ.  53 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా రూ. 72.27 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అఖండ. ఈ  సినిమాను ఈ నెల 21న హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్  కానున్నట్లు తాజా సమాచారం. ఇక మరోవైపు అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.






    ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది. ఇండస్ట్రీలో 50 రోజులు ఓ సినిమా పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ కాస్త మిక్స్ డ్ టాక్ వస్తేనే నెల తిరిగే లోపు ఓటీటీలో పడిపోతోంది. అలాంటి నేపథ్యంలో అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రోజులు ఆడటం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

    Ram Charan : RRR తర్వాత తగ్గేదేలే అంటున్న రామ్ చరణ్.. చెర్రీ లిస్టులో పెరుగుతోన్న క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్..

    ఇక సుదర్శన్ 35 ఎంఎం వేదికగా ఈ వేడుకలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. అంతేకాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారట. ఇందుకోసం నిర్మాత స్వస్థలం అయిన సూర్యపేటలో భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలయ్యతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సిసలైన క్లీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా అఖండ నిలిచిందని బాలయ్య ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda, Balakrishna, NBK, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు