HOME »NEWS »MOVIE »nandamuri balakrishna act in yash kgf 2 here is the proof mnj

Balakrishna: య‌శ్ 'కేజీఎఫ్ 2'లో న‌టిస్తోన్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ప్రూఫ్ ఇదుగో

Balakrishna: య‌శ్ 'కేజీఎఫ్ 2'లో న‌టిస్తోన్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ప్రూఫ్ ఇదుగో
బాలయ్య కేజీఎఫ్ 2

క‌న్న‌డ న‌టుడు య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం కేజీఎఫ్ 2(KGF 2). 2018లో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన కేజీఎఫ్ సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇక మొద‌టి భాగంలో న‌టించిన ప‌లువురు రెండో భాగంలో కూడా కంటిన్యూ అవుతుండ‌గా

  • Share this:
    క‌న్న‌డ న‌టుడు య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం కేజీఎఫ్ 2. 2018లో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన కేజీఎఫ్ సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇక మొద‌టి భాగంలో న‌టించిన ప‌లువురు రెండో భాగంలో కూడా కంటిన్యూ అవుతుండ‌గా.. సంజ‌య్ ద‌త్, ర‌వీనా టాండెన్, ప్ర‌కాష్ రాజ్, రావు రమేష్ రావు వంటి వారు కూడా సీక్వెల్‌లో పాలు పంచుకుంటున్నారు. కాగా ఈ భారీ బ‌డ్జెట్ కేజీఎఫ్ 2లో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా భాగం అయ్యారు. ఏంటి న‌మ్మడం లేదా..? అయితే ఒక ప‌నిచేయండి. గూగుల్‌లో కేజీఎఫ్ 2 అని కొట్టండి. ఆ త‌రువాత కాస్ట్‌లోకి వెళ్తే.. అందులో బాల‌కృష్ణ పేరు క‌నిపిస్తుంది. ఇనాయ‌త్ ఖ‌లీల్ అనే పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్న‌ట్లు గూగుల్‌లో న‌మోదు చేశారు. కానీ నిజమైన స‌మాచారం ప్ర‌కారం కేజీఎఫ్ 2లో బాల‌య్య న‌టించ‌డం లేదు. అయితే సెర్చ్ ఇంజ‌న్‌ గూగుల్‌లో త‌ప్పులు రావ‌డం కొత్తేం కాదు. బాల‌య్య విష‌యంలోనే గ‌తంలో ఓ సారి గూగుల్‌లో త‌ప్పు వ‌చ్చింది. అప్పుడు బాల‌య్య ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు.

    కాగా కేజీఎఫ్ 2 టీజ‌ర్ జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఈ మ‌ధ్య‌న ప్ర‌శాంత్ నీల్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అలాగే కేజీఎఫ్ 3 రూమ‌ర్ల‌పై కూడా ఆయ‌న స్పందించారు.  కేజీఎఫ్ కి ఇంక సీక్వెల్ ఆలోచ‌నలు లేవ‌ని వివ‌రించారు.



    కేజీఎఫ్ 2


    ఇదిలా ఉంటే మ‌రోవైపు బాలయ్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రి కాంబోలో మూడో చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేందుకు బాలయ్య సిద్ధమయ్యారని, ఈ క్రమంలో పలువురు యువ దర్శకులు ఆయనకు కథ చెప్పేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
    Published by:Manjula S
    First published:December 28, 2020, 20:49 IST

    टॉप स्टोरीज