NANDAMURI BALAKRISHNA ACCEPTED A GUEST ROLE IN SHIVARAJKUMAR BHAIRATHI RANAGAL MOVIE PK
బాలకృష్ణ అతి త్వరలో ఆ హీరో బాకీ తీర్చేస్తాడంట.. వెయిట్ అండ్ సీ..
బాలయ్య ఫైల్ ఫోటో
బాలకృష్ణ ఎవరి బాకీ ఉంచుకోడు.. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ నందమూరి హీరో. ఒకప్పుడు తనకు సాయం చేసిన ఓ కన్నడ హీరోకు ఇప్పుడు తాను సాయం చేయబోతున్నాడు బాలకృష్ణ. కన్నడ సినీ పరిశ్రమతో బాలకృష్ణకు మంచి సంబంధాలున్నాయి. ఇప్పుడు అక్కడి హీరోలకు తనవంతు సాయం చేస్తున్నాడు బాలయ్య.
బాలకృష్ణ ఎవరి బాకీ ఉంచుకోడు.. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ నందమూరి హీరో. ఒకప్పుడు తనకు సాయం చేసిన ఓ కన్నడ హీరోకు ఇప్పుడు తాను సాయం చేయబోతున్నాడు బాలకృష్ణ. కన్నడ సినీ పరిశ్రమతో బాలకృష్ణకు మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా అక్కడ రాజ్ కుమార్ ఫ్యామిలీతో బాలయ్య చాలా సాన్నిహిత్యంగా ఉంటాడు. ఆయన ఇద్దరు తనయులు పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్‌లతో బాలయ్య స్నేహంగా ఉంటాడు. ఆ మధ్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లిన బాలకృష్ణకు వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడు పునీత్ రాజ్ కుమార్.
బాలయ్య పునీత్ రాజ్ కుమార్
అంతేకాదు బాలయ్య బెంగుళూరులో ఉన్న రెండు రోజులు కంటికి రెప్పలా చూసుకున్నారు ఈ అన్నాదమ్ములు. ఒక వేడుకలో అయితే బాలయ్య బుగ్గపై ఏదో మరక పడితే స్వయంగా తన కర్చీఫ్‌తో తుడిచాడు పునీత్ రాజ్ కుమార్. ఇది చూసి అక్కడి అభిమానులు కూడా సంతోషంగా ఫీలయ్యారు. తనకు ఇంతగా సాయపడుతున్న ఈ కన్నడ హీరోలకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు బాలకృష్ణ. శివ రాజ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న భైరతి రనగల్ సినిమాలో బాలయ్య అతిధి పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఈయనకు 125వ సినిమా.
బాలయ్య శివరాజ్ కుమార్
సరిగ్గా రెండేళ్ల కింద బాలయ్య నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో శివరాజ్ కుమార్ ఒక అతిథి పాత్ర చేశాడు. అందులో ఓ పాటలో కనిపించాడు ఈయన. ఇప్పుడు ఈయన బాకీ ఇలా తీర్చుకుంటున్నారు బాలకృష్ణ. ఇదిలా ఉంటే శివరాజ్ కుమార్ సినిమాలో తెలుగు హీరోలు నటించడం ఇదే తొలిసారి కాదు. ఆ మధ్య వజ్రకాయ సినిమాలో రవితేజతో స్టెప్పులేయించాడు శివరాజ్ కుమార్. ఇప్పుడు మరోసారి బాలయ్యతో అదే పనిచేయబోతున్నాడు కన్నడ హీరో. మరి కన్నడనాట బాలకృష్ణ చేయబోయే రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.