Balakrishna: తలసేమియా బాధితులకు అండగా ఉండాలంటున్న బాలకృష్ణ..

Nandamuri Balakrishna: నందమూరి బాలయ్య అంటే కేవలం సినిమా హీరో మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. సాయం అంటూ కోరిన వాళ్లను కాదనకుండా ఆదుకుంటాడు ఈ సీనియర్ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 1, 2020, 1:04 PM IST
Balakrishna: తలసేమియా బాధితులకు అండగా ఉండాలంటున్న బాలకృష్ణ..
బాలకృష్ణ (balakrishna nandamuri)
  • Share this:
నందమూరి బాలయ్య అంటే కేవలం సినిమా హీరో మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. సాయం అంటూ కోరిన వాళ్లను కాదనకుండా ఆదుకుంటాడు ఈ సీనియర్ హీరో. ఓ వైపు సినిమా హీరోగా బిజీగా ఉంటూనే.. మరోవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా తను చేయాల్సిన పనులు చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు బాలయ్య. ఎప్పుడు ఎవరొచ్చి సాయం అడిగినా కూడా తన వంతుగా ముందుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఎంతో మందికి సాయం చేస్తున్నాడు బాలయ్య. కేన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నాడు బాలయ్య. ఈ హాస్పిటల్ ఛైర్మెన్‌గా పేదలకు అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే కరోనా సమయంలో కూడా అండగా నిలిచాడు. ఇప్పుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు అండగా ఉండటానికి ముందుకు వచ్చాడు బాలయ్య.

బాలయ్య బోయపాటి శ్రీను (Balakrishna boyapati)
బాలయ్య (Balakrishna)


అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువతతో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపుకు వచ్చి రక్తదానం చేయాలని బాలయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధి గురించి వివరించాడు ఈయన. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారుల్లో వస్తుందని.. వాళ్లకు రక్తం తక్కువగా ఉంటుందని తెలిపాడు. రక్తదానం చేస్తే వాళ్ల ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారంటూ పిలుపిచ్చాడు బాలయ్య.

ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కనుక.. తోటివారి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్తదానం మాత్రమే అంటూ అభిమానులతో పాటు అందరినీ పిలిచాడు బాలయ్య. అందుకే అభిమానులు, కార్యకర్తలు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి.. తోటివారి ప్రాణాలను కాపాడాలని బాలకృష్ణ పిలుపునిచ్చాడు. మన సమాజంలో ఉన్న వాళ్లను కాపాడుకోవడం మన బాధ్యత అంటున్నాడు ఈయన. బాలయ్య చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సహకారం అందించడానికి అభిమానులతో పాటు సాధారణ జనం కూడా సై అంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: October 1, 2020, 12:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading