బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కన్ఫామ్ చేసిన ప్రముఖ టీవీ ఛానెల్..

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: October 16, 2019, 9:24 AM IST
బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కన్ఫామ్ చేసిన ప్రముఖ టీవీ ఛానెల్..
పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తోన్న బాలకృష్ణ (Twitter/Photo)
news18-telugu
Updated: October 16, 2019, 9:24 AM IST
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే..  ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే దసరా సందర్భంగా  విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్‌ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ‘రూలర్’ అని జెమిని టీవీ వారు కన్ఫామ్ చేసారు. ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ కాకుండా... జెమిని టీవీ కన్ఫామ్ చేయడాన్ని చూసి చిత్ర వర్గాలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏమైనా బాలకృష్ణ కొత్త సినిమాకు ‘రూలర్’ టైటిల్ చూసి బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక  ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్‌తో పాటు  ‘క్రాంతి’, ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ అనే టైటిల్స్ కూడా పరిశీలించారు. మొత్తానికి బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు ఈ  సినిమాకు ‘రూలర్’ టైటిల్ కన్ఫామ్ చేసారు.


మొత్తానికి  బాలకృష్ణ కొత్త  సినిమాకు ఏ టైటిల్ పెడతారన్నదానికి పులిస్టాప్ పెట్టినట్టైయింది.  ఈ సినిమా తాజాగా షెడ్యూల్ ఈనెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...