బాలయ్య ఫ్యాన్స్‌ను కొట్టడమే చూశారు.. కానీ, ప్రేమిస్తే ఎలా ఉంటుందో చదవండి...

బాలయ్య అభిమానులను ఎంతగా ప్రేమిస్తాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 2:15 PM IST
బాలయ్య ఫ్యాన్స్‌ను కొట్టడమే చూశారు.. కానీ, ప్రేమిస్తే ఎలా ఉంటుందో చదవండి...
నందమూరి బాలకృష్ణ
news18-telugu
Updated: October 19, 2019, 2:15 PM IST
నందమూరి బాలకృష్ణ అంటే... ఎప్పుడూ కార్యకర్తలు, ఫ్యాన్స్‌ను కొడుతూ ఉంటారని పేరు. బాలయ్య ఫ్యాన్స్ మీద ఎదుకు అంతలా విరుచుకుపడుతూ ఉంటారని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అయితే, గతంలో బాలయ్య కోపాన్ని, కొట్టడాన్నే చాలా మంది చూపించారు. కానీ, బాలకృష్ణ తన అభిమానులను ఎంతగా ప్రేమిస్తాడనేదానికి ఈ స్టోరీ ఓ చక్కని ఉదాహరణ. జీ తెలుగులో ‘డ్రామా జూనియర్స్‌’ టీవీ షోతో జూనియర్ బాలయ్యగా పేరు తెచ్చుకున్న ఆరేళ్ల గోకుల్ అకస్మాత్తుగా కన్నుమూశాడు. సినిమాల్లో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్‌ను బుల్లితెర మీద ఆ బుడతడు పలుకుతుంటే.. అచ్చం బాలయ్యే చెప్పినట్టు ఉండేవి. దీంతో అందరూ అతడిని జూనియర్ బాలయ్యగా పిలుస్తారు. అలాంటి గోకుల్‌కు డెంగీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే, బాలుడు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యాడు.

nandamuri balakrishna deep condolence to his children fan gokul sudden death,nandamuri balakrishna,balayya,bala,balakrishna deep condelence to his fan gokul death,balakrishna fan death,nandamuri balakrishna deep condolence,nandamuri balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,balakrishna ruler movie,balakrishna movie updates,balakrishna roja,balakrishna tdp mla,tollywood,telugu cinema,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలయ్య,అభిమాని మరణంపై బాలయ్య భావోద్వేగం,చిన్నారి అభిమాని గోకుల్ మరణంపై బాలకృష్ణ సంతాపం,అభిమాని మరణంపై బాలయ్య సంతాపం,బాలకృష్ణ సంతాపం,బాలయ్య సంతాపం,బాలకృష్ణ రూలర్,రూలర్,బాలయ్య రూలర్
బాలయ్య అభిమాని గోకుల్ (Facebook/Photo)


‘నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలిచివేసింది. ఆ చిన్నారి డైలాగులు చెప్పే విధానం.. హావభావాలు చూసి నాకు ఎంత ముచ్చటేసిది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేశాడు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలకృష్ణ




బాలయ్య అభిమానులను ఎంతగా ప్రేమిస్తాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. గోకుల్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు,తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటి పక్కనవారిని అలరిస్తూ అలా టీవీల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు.

జగన్‌ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...