NANDAMURI BALA KRISHNA THINKING OF LAUNCHING MOKSHAGNA THROUGH THIS YOUNG DIRECTOR GUESS WHO IS HE BA
Nandamuri Mokshagna: బాలయ్య డేరింగ్ డెసిషన్.. మోక్షజ్ఞ లాంఛింగ్ ఈ డైరెక్టర్ చేతిలోనే?
నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ కూడా సకుటుంబంగా ఉప్పెన సినిమాను చూశారు. బాలయ్య కోసం నిర్మాతలు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ సినిమాకు బాలయ్య ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. ఆ సినిమా చూసిన తర్వాత నిర్మాత, దర్శకులను బాలయ్య అభినందించారు.
నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఆయన చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ కూడా యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇతర మార్షల్ ఆర్ట్స్ట్, డ్యాన్స్‌లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. 2021లోనే మోక్షజ్ఞ ఎంట్రీ కన్ ఫాం అయిపోయింది. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే ఓ ప్రముఖ డైరెక్టర్‌ను అనుకున్నా.. ఇప్పుడు కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. ఉప్పెన లాంటి సంచలన సినిమాకు దర్శకత్వం వహించిన సాన బుచ్చిబాబు. మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్‌ను లాంచ్ చేశఆడు సాన బుచ్చిబాబు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను మొదలు పెట్టినా.. తర్వాత ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది.ఈ నెలలోనే రిలీజ్ అయిన ఉప్పెన సినిమా ధియేటర్లలలో కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తోంది.
నందమూరి బాలకృష్ణ కూడా సకుటుంబంగా ఉప్పెన సినిమాను చూశారు. బాలయ్య కోసం నిర్మాతలు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ సినిమాకు బాలయ్య ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. ఆ సినిమా చూసిన తర్వాత నిర్మాత, దర్శకులను బాలయ్య అభినందించారు. సినిమా టేకింగ్ చాలా బాగుందని బాలయ్య డైరెక్టర్‌ను మెచ్చుకున్నారు.
ఉప్పెన సినిమా చూసిన బాలయ్య (Uppena Balakrishna)
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఓ పవర్ ఫుల్ సినిమాను రెడీ చేయించాలని బాలయ్య భావించారు. అయితే, ఇప్పుడు యాక్షన్ కంటే లవ్ లీ బాయ్‌గా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఓ మంచి కథ రెడీ చేయమని బుచ్చిబాబుకి చెప్పినట్టు తెలిసింది. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉప్పెనలో ఎమోషన్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఫ్యామిలీ డ్రామా లాంటివి చాలా బాగా హ్యాండిల్ చేసిన బుచ్చిబాబు చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని బాలయ్య భావిస్తున్నట్టు తెలిసింది.
నందమూరి మోక్షజ్ఞ
వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేసిన ఉప్పెన సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ పెద్ద సినిమాలు లేవు. దీంతో మెల్లగా రూ.100 కోట్ల క్లబ్లో చేరనుంది. మొదటి సినిమాతోనే మెగా ఫ్యామిలీలో ఎవరూ సాధించని రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్.