హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ షర్ట్ లెస్ ఫోటోను షేర్ చేసిన నమ్రత.. వైరల్ అవుతోన్న పిక్..

మహేష్ షర్ట్ లెస్ ఫోటోను షేర్ చేసిన నమ్రత.. వైరల్ అవుతోన్న పిక్..

సితార‌తో మహేష్ Photo : Instagram

సితార‌తో మహేష్ Photo : Instagram

సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం వంశీతో ఓ మాఫియా బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టి విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ఓ సై అన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్న సందర్బంలో ఈ సినిమా అక్టోబర్‌నుండి షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందట. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్న మహేష్ పిల్లలతో ఆడుకుంటున్నాడు. అందులో భాగంగా తన ఇంట్లో కొడుకు గౌతమ్‌తో స్విమ్మింగ్ చేస్తూ  సరదాగా గడుపుతున్నాడు. దీనికి సంబందించిన ఓ ఫోటోను నమ్రత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే రీల్ లైఫ్ లో కాకుండా, రియల్ లైఫ్ లో మహేష్ బాబు షర్ట్ లేకుండా ఎప్పుడూ కనిపించలేదు. తొలిసారిగా మహేష్ ఆ ఫోటోలో షర్ట్ లెస్‌తో కనబడుతున్నాడు. ఇక మహేష్ పరశురామ్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. అందులో భాగంగా మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన మొదట హిందీ నటి కియారాను తీసుకోవాలనీ చూశారట. ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించింది. కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. కియారా నో అనడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి ఏవరైతే బాగుంటారనీ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా కీర్తి సురేష్‌ను కూడా చిత్రబృదం పరిశీలిస్తుందట. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మహేష్.View this post on Instagram


Getting ready for a lap !! My water babies 💕💕💕#lockdown #stayhome


A post shared by Namrata Shirodkar (@namratashirodkar) onFirst published:

Tags: Mahesh, Mahesh babu, Namratha Shirodkar

ఉత్తమ కథలు