హోమ్ /వార్తలు /సినిమా /

Namrata Shirodkar: గౌతమ్, సితారలా విషయంలో అలానే ఉంటానంటూ సీక్రెట్స్ చెప్పేసిన నమ్రత!

Namrata Shirodkar: గౌతమ్, సితారలా విషయంలో అలానే ఉంటానంటూ సీక్రెట్స్ చెప్పేసిన నమ్రత!

Namrata Shirodkar: ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు తమ తల్లుల ప్రేమలను సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటున్నారు.

  Namrata Shirodkar: ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు తమ తల్లుల ప్రేమలను సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటున్నారు. అంతేకాకుండా సెలబ్రెటీలు తమ తల్లి తనాన్ని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక స్టార్ సెలబ్రెటీల నుండి యంగ్ సెలబ్రిటీల వరకు తమ తల్లుల తో దిగిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నమ్రత తన పిల్లల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

  టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కుటుంబం పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఈ కుటుంబం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక మహేష్ భార్య నమ్రత కూడా తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనగా కొన్ని విషయాలు పంచుకుంది.

  నమ్రత తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తుందట‌. అంతేకాకుండా వారి ఇష్టాయిష్టాలను గౌరవిస్తూనే వారికి మంచిచెడుల గురించి ఎప్పటికప్పుడు తెలుపుతుందట‌. వారిని వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెప్పడమే కాకుండా.. మంచి, చెడులకు మధ్యలో ఉన్న తేడాల గురించి వారికి తెలుపుతుందట‌. ఇక ఏ పిల్లలు అదేపనిగా చదువుకోడానికి ఇష్టపడరని, అందుకే వాళ్లని చదివించే సమయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుందట నమ్రత.

  అంతేకాకుండా ఆటలు కూడా వారి జీవితంలో ఒక భాగమని.. తన కొడుకు గౌతమ్ స్విమ్మింగ్ ఇష్టపడతాడని, తన కూతురు సితార కు డాన్స్ అంటే ఇష్టమని తెలిపింది. ఇక తన ఇద్దరు పిల్లలు తనకు బంగారం అంటూ.. ఇక వాళ్ళని మ్యానేజ్ చేయడం తనకెప్పుడూ చాలెంజింగ్ గా అనిపించలేదని తెలిపింది. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే సరదాగా గడపడం కామన్ కదా అంటూ.. తమ ఇంట్లో కూడా తమ పిల్లలు ఇద్దరు అంతే అని చెప్పుకొచ్చింది నమ్రత.

  First published:

  Tags: Gautham, Mahesh babu family, Namrata, Namrata Shirodkar, Sitara ghattamaneni, గౌతమ్, నమ్రత, సితార

  ఉత్తమ కథలు