Mahesh Babu - Namrata: కెరీర్ కొత్తలో హీరోగా నిలబడటానికి మహేష్ బాబు చాలా కష్టపడ్డాడు. రాజకుమారుడు సినిమా హీరోగా గుర్తింపు అయితే తీసుకొచ్చింది కానీ స్టార్‌గా మాత్రం మార్చలేదు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ సినిమాలు అంచనాలు అందుకోలేదు.
కెరీర్ కొత్తలో హీరోగా నిలబడటానికి మహేష్ బాబు చాలా కష్టపడ్డాడు. రాజకుమారుడు సినిమా హీరోగా గుర్తింపు అయితే తీసుకొచ్చింది కానీ స్టార్‌గా మాత్రం మార్చలేదు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు కెరీర్ డైలమాలో పడిపోయింది. అలాంటి సమయంలో వచ్చిన మురారి సినిమా సంచలన విజయం సాధించి మహేష్ బాబు మార్కెట్‌ను భారీగా పెంచేసింది. కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ ఈయన విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. 2001, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. మహేష్ బాబు నటనకు అంతా ఫిదా అయిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ మార్క్ టేకింగ్ మురారి సినిమాకు ప్లస్ అయింది. ఇప్పటికీ మురారి చూస్తుంటే అదే ఫ్రెష్ ఫీల్ వస్తుంది కానీ 20 ఏళ్ళ పాత సినిమా అనిపించదు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే పరిచయం అయింది. మురారి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు అభిమానులు #20YearsOfMurari ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా మనసులో మాట బయటపెట్టింది. తన భర్త నటించిన అన్ని సినిమాలు తనకు యిష్టమే అని.. కానీ మురారి అంటే ప్రత్యేకమైన యిష్టం అని చెప్పింది.
మురారి వర్కింగ్ స్టిల్ (Murari movie)
ఈ సినిమా ఎప్పటికీ బోర్ కొట్టదు.. ఎప్పటికీ పాతబడదు అంటూ రాసుకొచ్చింది నమ్రత. ఈ సినిమాలోని ఫన్.. సంగీతం ఇంకా ఇతర విషయాలు అన్నీ కూడా ప్రత్యేంగా ఉంటాయని తెలిపింది నమ్రత మహేష్. అలాంటి అంశాలున్న సినిమాలు ఇప్పుడు రావడం లేదని.. అలాంటి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇప్పటి సినిమాల్లో చూడటం కష్టమే అని తేల్చేసింది నమ్రత.
ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే నటన అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరని.. నిజమైన క్లాసిక్‌కు అర్థం మురారి అని చెప్పింది నమ్రత. అలా చెప్పి మహేష్ బాబు, నమ్రత, కృష్ణవంశీ ఉన్న ఫోటోను షేర్ చేసింది మహేష్ బాబు సతీమణి. మురారి గురించి షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మందికి పైగా స్పందించారు.