మహేష్ బాబు తన 45వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు రచ్చ చేస్తున్నారు. వరల్డ్ రికార్డులు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ పుట్టిన రోజును ప్రేమతో సెలబ్రేట్ చేసుకుంటుంది నమ్రత శిరోద్కర్. అసలు నిజమైన ప్రేమలో ఉన్న ఆనందం ఏంటో నీ వల్లే తెలుసుకున్నామంటూ నమ్రత రాసుకొచ్చింది. 'వంశీ' సినిమా సెట్స్‌లో ఉన్నపుడు నమ్రతతో ప్రేమలో పడిపోయాడు మహేష్ బాబు.
ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ.. 2005లో పెళ్లి చేసుకున్నారు. ఈ 15 ఏళ్ల జీవితంలో నీ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను అంటూ ఎమోషనల్ అయిపోయింది నమ్రత శిరోద్కర్. టాలీవుడ్లో ఫ్యామిలీ హీరో అంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు. ఎందుకంటే ఏ మాత్రం టైమ్ దొరికినా కూడా వెంటనే టూర్ వెళ్తుంటాడు సూపర్ స్టార్.
వీలైనంత వరకు కుటుంబంతోనే సమయం గడిపేస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నమ్రత చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో నమ్రత నుదుటి మీద ప్రేమగా ముద్దుపెట్టుకుంటున్నాడు మహేష్ బాబు. అది నమ్రత తీసిన సెల్ఫీ ఫొటో. దాంతో పాటు "True love is how I experience it with YOU. Happy Birthday MB. I love you, now and always. @urstrulymahesh. అని ఆమె రాసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Namratha Shirodkar, Telugu Cinema, Tollywood