హోమ్ /వార్తలు /సినిమా /

మహర్షి పిక్‌లో నమ్రతా మేకప్‌పై ట్రోలింగ్... దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన మహేష్ వైఫ్

మహర్షి పిక్‌లో నమ్రతా మేకప్‌పై ట్రోలింగ్... దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన మహేష్ వైఫ్

నమ్రతా శిరోద్కర్ (File)

నమ్రతా శిరోద్కర్ (File)

Maharshi Namrata Shirodkar : సోషల్ మీడియాలో ట్రోలింగ్ చెయ్యడం ఓ ప్యాషనైపోతోంది చాలా మందికి. నోటికొచ్చినట్లు కామెంట్లు పెడుతుంటే... వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు సెలబ్రిటీలు.

మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్... మహర్షి సినిమా రిలీజ్ సందర్భంగా... సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఓ సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. సెలబ్రిటీ అన్నాక... తమ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కామనే. వాటిపై అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్లు, షేరింగ్‌లు చేస్తుంటారు. ఐతే... కొంతమంది మాత్రం అభ్యంతరకరమైన ట్వీట్లు పెడుతుంటారు. మాజీ మిస్ ఇండియా ఫొటోలు పెట్టేటప్పుడు కాస్త మేకప్ వేసుకోవచ్చుగా... మీరు డిప్రెషన్ (ఒత్తిడి)లో ఉన్నట్లు కనిపిస్తున్నా్రు అందుకే మేకప్ వేసుకోలేదేమో.... అంటూ గౌరవ్ అనే పేరుతో ఉన్న ఓ ఇన్‌స్టాగ్రాం యూజర్ అభ్యంతరకరమైన కామెంట్ పెట్టాడు. అతను తప్ప మిగతా అందరూ... ఆ పిక్‌పై పాజిటివ్ గానే స్పందించారు.దీనిపై నమ్రతా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. గౌరవ్ మీరు మేకప్‌తో ఉన్న మహిళల్ని ఇష్టపడతారేమో... ఒక వేళ మీరు ఎప్పుడూ మేకప్‌తో ఉన్నవారిని ఫాలో అవుతారేమో... అది మీకు సెట్ కావచ్చు. అలాంటివి ఈ పేజీపై మీకు కనిపించవు. కాబట్టి మీరు ఆ విషయాన్ని వదిలేయడం మంచిది. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అని నమ్రతా రిప్లై ఇచ్చింది.

నమ్రాతా రిప్లైకి పెద్ద ఎత్తున లైక్స్ వచ్చాయి. చాలా మంది ఆమె కామెంట్‌కి సపోర్ట్ చేశారు. మహిళలు ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాల్సిన అవసరం లేదంటూ... గౌరవ్‌కి నాలుగు వడ్డించారు.

namrata shirodkar,maharshi,maharshi movie,mahesh babu wife namrata shirodkar,namrata,mahesh babu maharshi,maharshi trailer,namrata shirodkar mahesh babu,maharshi public talk,mahesh babu wife namrata,mahesh babu maharshi movie,mahesh babu,instagram,troll,trolling,నమ్రతా శిరోద్కర్,మహర్షి సినిమా,మహర్షి మూవీ,ఇన్‌స్టాగ్రామ్,ట్రోలింగ్,విమర్శలు,ఫెయిల్,మహేష్ బాబు,
గౌరవ్ కి నమ్రతా ఇచ్చిన రిప్లై (Image : Instagram)

నమ్రతా ఒకప్పుడు బ్యూటీ పేజెంట్‌లో విన్నర్. 1993లో మిస్ ఇండియా. బాలీవుడ్‌లో హీరో హిందుస్థానీ, బ్రైడ్ అండ్ ప్రెజ్యుడీస్, వాస్తవ్ : ది రియాలిటీ లాంటి సినిమాల్లో చేశారు. వంశీ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించారు. ఇద్దరూ ప్రేమలో పడి... ఐదేళ్ల తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు.

రిపోర్ట్స్ ప్రకారం మహేష్ బాబు, పూజా హెగ్డే లీడ్ రోల్స్‌లో చేసిన మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే రాబట్టింది. బాహుబలి సిరీస్ కాకుండా... మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్లు రాబట్టిన సినిమాల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.

Published by:Krishna Kumar N
First published:

Tags: Instagram, Maharshi, Namrata, Telugu Cinema, Tollywood news

ఉత్తమ కథలు