హోమ్ /వార్తలు /సినిమా /

Namrata - Shilpa Shirodkar: తండ్రి సోదరితో కలిసి ఉన్న మహేష్ భార్య నమ్రత రేర్ పిక్..

Namrata - Shilpa Shirodkar: తండ్రి సోదరితో కలిసి ఉన్న మహేష్ భార్య నమ్రత రేర్ పిక్..

తండ్రితో నమ్రత, శిల్పా శిరోద్కర్ పాత చిత్రం (Instagram/Photo)

తండ్రితో నమ్రత, శిల్పా శిరోద్కర్ పాత చిత్రం (Instagram/Photo)

Namrata - Shilpa Shirodkar | మహేష్ బాబు భార్య నమ్రత  సోదరి శిల్పా శిరోద్కర్ కూడా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈమె కూడా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఈమె తన తండ్రి, సోదరితో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

  Namrata - Shilpa Shirodkar | సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన సినిమా విశేషాలతో పాటు కుటుంబ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమాలనుతో పంచుకుంటున్నాడు. మరోవైపు మహేష్ బాబు భార్య..నమ్రత కూడా సామాజిక మాధ్యమాల్లో మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. ఇక మహేష్ బాబు భార్య నమ్రత  సోదరి శిల్పా శిరోద్కర్ కూడా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈమె కూడా పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మ’ సినిమాలో నటించింది. అటు నమ్రత కూడా ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. వీళ్లిద్దరు బి.గోపాల్ దర్శకత్వంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం విశేషం. ఆ సంగతి పక్కన పెడితే..

  ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్.. వాళ్ల నాన్నతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం వాళ్ల నాన్న కన్నుమూసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. లవ్ యూ పాప  వీ మిస్ యూ సో మచ్ అంటూ రాసుకొచ్చారు.


  51 ఏళ్ల శిల్పా యూఏఈలో కోవిడ్‌కు సంబంధించిన వ్యాక్సిన్ తీసుకున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.ఐతే.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తొలి భారతీయ నటిగా మహేష్ బాబు భార్య నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ నిలిచారు. ఈమె ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. శిల్పా శిరోద్కర్ బాలీవుడ్‌లో పలు  సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో ‘హమ్’, ‘గోపీ కిషన్’, కిషన్ కన్హయ్య’ బేవాఫా సనమ్’ వంటి సినిమాలున్నాయి. తెలుగులో కూడా ఈమె మోహన్ బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మ’ సినిమాలో కథానాయికగా నటించింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే.. 2000 సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన అపరేష్ రంజిత్‌‌ను పెళ్లి చేసుకుంది. వివాహాం అయిన కొన్నేళ్ల తర్వాత 2013లో ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే సీరియల్‌లో నటించింది. ఈమె మహేష్ బాబు భార్య నమ్రత  స్వయానా చెల్లెలు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh Babu, Namrata, Tollywood

  ఉత్తమ కథలు