Home /News /movies /

NAMITHA SENSATIONAL COMMENTS ON HER OVERWEIGHT AND HER HABITS SR

Namitha : ఆ కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను : నమిత..

Namitha Photo : Twitter

Namitha Photo : Twitter

Namitha: నమిత తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించి.. తన అందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

    Namitha: నమిత తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించి.. తన అందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నమిత మొదట్లో సన్నజాజీలానే కనిపించింది. అయితే ఆ తర్వాత తమిళంలోకి అడుగు పెట్టి అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తయారైన నమిత.. కొన్ని సంవత్సరాల వరకు అదరగొట్టింది. అయితే ఒక దశ దాటాక నమిత మరీ బరువెక్కిపోయింది. దీనికి కారణం ఆమె మద్యం, సిగరెట్‌కు బానిస అయిపోయిందని.. ఈ క్రమంలోనే బరువు విపరీతంగా పెరిగిపోయాయని రూమర్స్ వినపడ్డాయి. ఇక ఆతర్వాత కొన్ని సంవత్సరాలకు నమిత పెళ్లి కూడా చేసుకుంది. తాజాగా ఉన్నట్లుండి నమిత బాగా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. మొదట్లో హీరోయిన్ అయిన కొత్తలో ఎలా ఉందో అంత నాజుగ్గా తయారై మతులు పోగోడుతోంది. బాగా బరువు తగ్గిన నమిత జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో కూడా ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
    ఈ క్రమంలోనే నమిత మీడియాతో మాట్లాడుతూ.. తన గురించి చాలా విషయాల్లో కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. బరువు పెరగడానికి సిగరెట్, మద్యం లాంటి దురలవాట్లు కారణం కాదని పేర్కోంది.









    నమిత ఇంకా మాట్లాడుతూ.. తాను డిప్రెషన్ కారణంగా ఐదున్నరేళ్ల పాటు నరకం చూశానని పేర్కోంది. ఈ కారణంగా తాను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, బాగా నిద్ర పోవడం కోసం అతిగా తినేసేదాన్నని అందులో భాగంగా జంక్ ఫుడ్ లాంటివి తినడం బాగా అలవాటైందని పేర్కోంది. దీనికి తోడు థైరాయిడ్ సమస్య కూడా తోడవ్వడంతో తన బరువు విపరీతంగా పెరిగిందని తెలిపింది. అయితే చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఇవన్నీ తెలియక తన గురించి తప్పుడు ప్రచారాలు చేశారని నమిత ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని.. సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని పేర్కోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news, Tollywoood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు