హోమ్ /వార్తలు /సినిమా /

Najabhaja: గాడ్ ఫాదర్ సెకండ్ సాంగ్ రిలీజ్.. మెగా కిక్కంటే ఇదే!!

Najabhaja: గాడ్ ఫాదర్ సెకండ్ సాంగ్ రిలీజ్.. మెగా కిక్కంటే ఇదే!!

God Father Chiranjeevi Photo Twitter

God Father Chiranjeevi Photo Twitter

Chiranjeevi God Father: మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నజాభజా సాంగ్ వదిలి మెగాలోకంలో పూనకాలు తెప్పించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా రాబోతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్ (God Father). మలయాళ చిత్రం లూసీఫర్ తెలుగు రీమేక్ గా భారీ హంగులు జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తుండటం విశేషం. మోహన్ రాజా (Mohan Raj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara) ముఖ్య పాత్రలో నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి నజాభజా పేరుతో రెండో సింగిల్‌ ని విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో చూపించిన సన్నివేశాలు, మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ లుక్ మెగా అభిమానులకు స్పెషల్ కిక్ ఇస్తోంది. థమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ అట్రాక్షన్ అయింది. శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర ఆలపించారు. చూస్తుంటే ఈ సాంగ్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అవుతుందని తెలుస్తోంది. విడుదలైన కాసేపట్లో ఈ సాంగ్ వైరల్ గా మారింది.

అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ ఫుట్ పుట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ ఫైనల్ కాపీని మెగాస్టార్ చిరంజీవి చూశారని ఇన్ సైడ్ టాక్. గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీని మెగాస్టార్ తన ఇంట్లోనే వీక్షించారని చెబుతున్నారు. ఈ కాపీ చూసిన తర్వాత మెగాస్టార్ బాగా ఎక్సైట్ అయ్యారని తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ తో చెప్పారట. గాడ్ ఫాదర్ చూసిన వెంటనే దర్శకుడు మోహన్ రాజాను చిరంజీవి ప్రశంసించినట్లు సమాచారం.

ఈ భారీ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్ భాగం కావడంతో మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అంతకుమించిన హిట్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ లో చిరంజీవి రఫ్‌లుక్‌తో మెగా లోకాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. చిరంజీవికి చెల్లెలుగా న‌య‌నతార కనిపించనుంది. రేపు (సెప్టెంబర్ 28) సాయంత్రం అనంతపురంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది.

Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, God father, Tollywood

ఉత్తమ కథలు