నాగిని సీరియల్ (Nagini Serial) పాపులారిటీ అందరికీ తెలిసిందే.. ఈ సిరియల్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగిని సిరియల్లో నటించే వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. తాజాగా ఈ సీరియల్ 6వ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ సిరియల్ను ఏక్తా కపూర్ (Ekta Kapoor) నిర్వహణలో సాగుతుంది. నాగిని సీజన్-6 ఫిబ్రవరి 12, 2022న విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ సారి నాగిని ప్రధాన పాత్రంలో బిగ్ బాస్ 15 విజేత (Bigg Boss 15) తేజస్వి ప్రకాశ్ నటిస్తోంది. ఈ సీరియల్లో ' ఇచ్ఛాధారి-నాగిన్'గా ఆమె నటించనున్నట్టు సీరియల్ నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Mandira Bedi: ముద్దుగుమ్మలు ఒక్కచోట.. మౌని రాయ్ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన మందిరా బేడీ!
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
శనివారం, కలర్స్ టీవీ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలో టీజర్ విడుదలైంది. తేజస్వి ప్రకాశ్‌ను ' సర్వశేష్ట నాగిన్'గా ప్రదర్శిస్తూ తాజా టీజర్‌ను విడుదల చేసింది. ప్రపంచాన్ని రక్షించడానికి సర్వాంగ సుందరి నాగిన్ వస్తోంది.
OTT Movies: ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఓటీటీల్లో విడుదలయ్యే టాప్ మూవీస్, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ఆమె గ్రాండ్ లుక్‌తో ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి అని పోస్ట్ చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన తేజస్వి ఇమేజ్ సీరియల్‌కు మరింత ఉపయోగపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే నాగిని సీరియల్‌కు ఉన్న ఇమేజ్‌తోపాటు తేజస్వికి ఉన్న గ్లామర్ అదనపు ఆకర్షణ అవుతుందని సీరియల్ నిర్వాహకులు భావిస్తున్నారు.
టీజర్ విడుదలైన కొద్దిసేపటికే, నాగిని సీరియల్ ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్లోకి వెళ్లి జోరుగా కామెంట్లు పెడుతున్నారు. తేజస్వి గ్లామర్‌తో నాగిని సీరియల్ మరింత బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్సల్ చేస్తున్నారు. హాటెస్ట్ నాగిని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కరోనాపై..
అయితే నాగిని-6పై కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి ట్విస్ట్ ఉంటుందని ముందుగానే యూనిట్ ప్రచారం చేస్తోంది. ఈసారి.. నాగిని సీరియల్లో నాగిని పొరుగు దేశం చెడు ప్రణాళిక నుంచి గ్రహాన్ని రక్షించనున్నట్టు లీక్‌లు వస్తున్నాయి. . నాగిన్-6లో తేజస్వి యొక్క బిగ్ బాస్ కో-కంటెస్టెంట్ సింబా నాగ్‌పాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
నాగిని బ్యూటీలు..
నాగిన్ మొదటి సీజన్లో మౌని రాయ్ (Moouni Roy) ప్రధాన పాత్రలో నటించింది. సీజన్-3లో ఆమె స్థానంలో సురభి జ్యోతి వచ్చింది. నాగిన్ 4లో నియా శర్మ, జాస్మిన్ భాసిన్, రేషామి దేశాయ్ ఇచ్చధారి-నాగిన్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్నారు. ఐదో సీజన్‌ను సురభి చందనా నటించింది. నాగిన్-5 తరువాత, కృష్ణ ముఖర్జీ నటించిన కుచ్ తో హై - నాగిన్ ఏక్ నయే రంగ్ మే అనే కార్యక్రమం యొక్క మరొక సీజన్ విడుదలైంది. తాజాగా నాగిని సీజన్ -6లో తేజస్వి ప్రకాశ్ (Tejasswi prakash) నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Ekta Kapoor, Voot