నాగార్జున ‘మన్మథుడు 2’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..

మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు.

news18-telugu
Updated: July 21, 2019, 6:59 PM IST
నాగార్జున ‘మన్మథుడు 2’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..
స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతోన్న నాగార్జున (Source: Twitter)
  • Share this:
మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. విజయ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభకు త్రివిక్రమ్ మాటలు తోడై ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది కూడా అందుకుంది. అలాంటి క్లాసిక్ చిత్రానికి సీక్వెల్‌గా రాహుల్ రవీంద్రన్ నాగార్జున హీరోగా ‘మన్మథుడు 2’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు. చేతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చిన ఈ పాటలో నాగార్జున .. ఫారెన్ భామలతో రొమాన్స్  చేసే ఈ పాటలో నాగార్జునను చూస్తే.. నాగ్ ఏజ్.. 60 అంటే అసలు నమ్మబుద్ది కావడం లేదు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ మూవీని ఆగష్ట్ 9న విడుదల చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 21, 2019, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading