సూపర్ హిట్ హిందీ మూవీ రీమేక్‌లో నాగార్జున.. దర్శకుడు ఎవరంటే..

ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా నాగార్జున.. హిందీలో హిట్టైన ఓ సూపర్ హిట్ సినిమాపై మనసు పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: July 10, 2020, 9:12 AM IST
సూపర్ హిట్ హిందీ మూవీ రీమేక్‌లో నాగార్జున.. దర్శకుడు ఎవరంటే..
నాగార్జున అక్కినేని (nagarjuna)
  • Share this:
ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా నాగార్జున.. హిందీలో హిట్టైన ఓ సూపర్ హిట్ సినిమాపై మనసు పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల క్రితం అజయ్ దేవ్‌గణ్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇపుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కూడా ఓన్ చేసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా రీమేక్‌ను నాగార్జున ప్రవీణ్ సత్తారు చేతిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు.. నాగార్జునను ఓ కథను ఓకే చేయించుకున్నాడు. కానీ నాగార్జున మాత్రం ఆ కథను నాగ చైతన్యతో చేయమని ప్రవీణ్‌కు  సూచించాడట.   మరోవైపు ‘రెయిడ్’ కథను ప్రవీణ్ సత్తారునే డీల్ చేయడమని చెప్పాడట. గతంలో నాగార్జున.. అజయ్ దేవ్‌గణ్ హీరోగా చేసిన ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత అజయ్ దేవ్‌గణ్ రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు.

nagarjuna will remake ajay devgan raid movie in telugu here are the details,Nagarjuna Akkineni,Nagarjuna remake ajay devgn raid movie,nagarjuna raid movie,nagarjuna raid movie,nagarjuna,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ, రెయిడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున,అజయ్ దేవ్‌గణ్ రెయిడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున
అజయ్ దేవ్‌గన్ ‘రెయిడ్’ మూవీ రీమేక్‌లో నాగార్జున (Twitter/Photo)


నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాగార్జున సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ముందుగా అనుకున్న ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను థాయిలాండ్‌లో పిక్చరైజ్ చేయాలి. కానీ కరోనా కారణంగా అక్కడ షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాతో  పాటు నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నాడు.ఇంకోవైపు ధనుశ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ఈ సినిమా  మళ్లీ పట్టాలెక్కనుంది. బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే.. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర చేస్తున్నాడు నాగార్జున. మొత్తంగా ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో చేయబోయే ‘రెయిడ్  సినిమాతో హిట్టు కొట్టడం పక్కా అంటున్నారు. ఇక హిందీలో కథానాయికగా నటించిన ఇలియానాతో పాటు విలన్‌గా నటించిన సౌరబ్ శుక్లా (సత్య ఫేమ్ కల్లుమామ)ను మెయిన్ విలన్‌గా తెలుగులో నటించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 10, 2020, 9:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading