హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna: బంగార్రాజు సినిమా కోసం తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న నాగార్జున.. షాక్‌లో ఫ్యాన్స్..

Nagarjuna: బంగార్రాజు సినిమా కోసం తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న నాగార్జున.. షాక్‌లో ఫ్యాన్స్..

నాగార్జున (File/Photo)

నాగార్జున (File/Photo)

Nagarjuna: బంగార్రాజు సినిమా కోసం తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న నాగార్జున.. షాక్‌లో ఫ్యాన్స్.. వివరాల్లోకి వెళితే..

Nagarjuna: బంగార్రాజు సినిమా కోసం తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న నాగార్జున (Nagarjuna).. షాక్‌లో ఫ్యాన్స్.. వివరాల్లోకి వెళితే.. నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందని ద్రాక్షనే అయింది. అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు నాగార్జున. ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై నాగార్జున ‘వైల్డ్ డాగ్’ (Wild Dog) ప్రమోషన్‌లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటీనటుల డేట్స్‌ను మళ్లీ రీ షెడ్యూల్ చేసారు. ఇక ఈ సినిమాను నాగార్జున జూలైలో పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసారు.

‘సోగ్గాడే చిన్నినాయనా’ విషయానికొస్తే.. హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. అంతేకాదు నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ఈ చిత్రంలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఇప్పటికిీ మరిచిపోలేదు. తొందర్లనే  ఈ సినిమాలో నటించబోయే నటీనటులు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. నాగార్జున అబ్బాయిగా నాగ చైతన్య నటిస్తుండగా.. మనవడిగా అఖిల్ యాక్ట్ చేయబోతన్నట్టు సమాచారం. ఈ సినిమాలో నాగార్జున అమాయకుడైన పాత్రతో చిలిపి తాతగా అలరించనున్నారు.

’సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున (Twitter/Photo)

ఇక నాగార్జున ఇతర సినిమాల  విషయానికొస్తే.. ఈ యేడాది  ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్‌లో రాలేదు. ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిందీలో హిట్టైయిన ఓ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. అదేనే కాదో చూడాలి. ఈ సినిమాలో నాగార్జున ’రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. జబర్ధస్త్ యాంకర్ రష్మి గౌతమ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది.  మరోవైపు నాగార్జున.. హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ లో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసారు. మరోవైపు ధనుశ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవతో ఓ సినిమా కూడా ఉంది. . మొత్తంగా నాగార్జున వరస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

First published:

Tags: Akhil Akkineni, Bangarraju, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు