Nagarjuna Wild Dog Release Date: నాగార్జున ఇప్పటికైనా వైల్డ్ డాగ్’ విడుదల తేదిని ప్రకటించడంపై అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అక్కినేని నాగార్జున ’వైల్డ్ డాగ్’ అనే సినిమా కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కంప్లీటైనా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కారణం కరోనా సమయంలో షూటింగ్ చేసిన ఈ సినిమాను థియేటర్స్‌లో ప్రేక్షకులు చూస్తారో లేదో అనుమానంతో ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో వైల్డ్ డాగ్’ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్మైమెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు. డిపార్ట్మెంట్లో అందరు వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఈ చిత్రంతో అహిషోర్ సోల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటించింది. సయామీ ఖేర్ మరో ఇంపాార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.
మన్మథుడు 2 లాంటీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబందించి ఆ మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్ డాగ్ విజయ్ వర్మ పాత్రలో అక్కినేని నాగార్జున ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
రీసెంట్గా సంక్రాంతి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ చూసి అందరు హీరోలు ఒక్కొక్కరుగా తమ సినిమాలను రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున కూడా ‘వైల్డ్ డాగ్’ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌తో ముందుగా రూ. 27 కోట్లకు చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయించి.. థియేటర్ రిలీజ్ తర్వాత 14 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకునేలా మళ్లీ ఒప్పందం చేసుకున్నరట. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు నాగార్జున, నిర్మాతలతో కలిసి ప్రకటించారు.
‘వైల్డ్ డాగ్’ సినిమాతో నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్గా ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. మరోవైపు నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
దాంతో పాటు ‘సోగ్గాడే చిన్నినాయనా’, సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం.మొత్తంగా నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా థియేటర్స్‌లో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.