Nagarjuna - Jr NTR : నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..

ఎన్టీఆర్, నాగార్జున (File/Photo)

Nagarjuna - Jr NTR : టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన మారారు ఎన్టీఆర్.

  • Share this:
    Nagarjuna - Jr NTR : టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన మారారు ఎన్టీఆర్. ఐతే... నాగార్జున, ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. అంతేకాదు నాగ్‌ను ఎన్టీఆర్‌ బాబాయి అని సంబోధిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ ఎందుకు తలనొప్పిగా మారాడని డౌట్ పడుతున్నారా.. .వివరాల్లోకి వెళితే.. నాగార్జున హోస్ట్‌గా త్వరలో బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది. తెలుగులో  బిగ్‌బాస్ సీజన్ 5కు మూడోసారి హోస్ట్‌గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి స్టార్ మాలో ఈ షో ప్రసారం కానుంది. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌ కూడా ఆగష్టులో ప్రారంభం కానుంది. దాదాపు ఈ రెండు షోలు ఒకే సమయంలో ప్రేక్షకులను పలకరిచంనున్నాయి. మొత్తంగా ఈ రెండు ప్రోగ్రామ్‌ల టీఆర్పీ విషయంలో ఆయా ప్రోగ్రామ్స్ నిర్వాహకులకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది.

    మొత్తంగా ఎన్టీఆర్ షో వల్ల నాగ్ హోస్ట్ చేస్తోన్న ‘బిగ్‌బాస్‌’ దెబ్బ పడే అవకాశం ఉందా. లేకపోతే.. నాగ్ షో వల్ల ‘ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’కు టీఆర్పీ తగ్గుతుందా అనేది చూడాలి.ఇమేజ్ సంగతి చూస్తే.. ఎన్టీఆర్, నాగార్జునకు అసలు పోల్చి చూడలేం. కానీ ఎన్టీఆర్‌కు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ నాగార్జునకు లేదనే చెప్పాలి.

    ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున (File/Photo)


    నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నారు. ఇక   ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేసిన సంగతి తెలిసిందే కదా.  ఇక ఎన్టీఆర్ కూడా ఈ ప్రోగ్రామ్‌తో ప్రతి ఇంటిని పలకరించనున్నారు.ఇప్పటి వరకు స్టార్ మా ఛానెల్‌లో ఇప్పటి వరకు మూడు సీజన్లు ప్రసారం అయ్యాయి. నాగార్జున హోస్ట్ చేసిన రెండు సీజన్లు సక్సెస్ అయితే.. చిరంజీవి చేసిన సీజన్ 3 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్లు ఈ ప్రోగ్రామ్‌ పై పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దాంతో జెమిని టీవీ వాళ్లు ఎన్టీఆర్‌తో ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసారు. మరి ఎన్టీఆర్ తన యాంకరింగ్‌తో ఈ షోకు హైయ్యెస్ట్ టీఆర్పీ సాధించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

    అపుడు బిగ్‌బాస్ ఎన్టీఆర్.. ఇపుడు నాగార్జున (Twitter/Photo)


    ఇక నాగార్జున హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్ కనిపించనుండగా.. తెలుగులో  బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను ఇక్కడి ప్రేక్షకుల మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు. మొత్తంగా అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్.. తారక్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ల ోనాగార్జున ప్రేక్షకులను పలకరించనున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి.

    ఇవి కూడా చదవండి..

    ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..

    RRR - Keeravani : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కీరవాణికి షాకింగ్ రెమ్యునరేషన్..
    Published by:Kiran Kumar Thanjavur
    First published: