Nagarjuna Vs Jr NTR : స్మాల్ స్క్రీన్ పై సై అంటే సై అంటోన్న ఎన్టీఆర్(Jr NTR), నాగార్జున (Nagarjuna) . ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడ్డ ఈ హీరోలు.. ఇపుడు తొలిసారి స్మాల్ స్క్రీన్ పై ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమిని టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Koteeswarulu)వంటి రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షోతో జనరల్ నాలెడ్జ్‌తో పాటు సామాన్యులను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మగ, ఆడ తేడా లేకుండా అందరు పార్టిసిపేట్ చేస్తుండటంతో దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కాకుండా మీలో ఎవరు కోటీశ్వరులు’ అని పెట్టినట్టు తన షోలో ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఫస్ట్ కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ (Ram Charan) హాట్ సీటులో కూర్చొని దాదాపు రూ. 25 లక్షల వరకు గెలచుకుని.. వచ్చిన ఫ్రైజ్ మనీని తన తండ్రి స్థాపించిన చిరంజీవి (Chiranjeevi) ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ షోలో ఒక ప్రశ్నకు రామ్ చరణ్.. రానా సాయం తీసుకోవడం. ఈ ముగ్గురు మధ్య సంభాషణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్‌బాస్ సీజన్ 5 (Bigg Boss 5 Telugu) సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌తో పాటు బిగ్‌బాస్ షో అర గంట గ్యాప్‌లో దాదాపు ఒకే సమయంలో ప్రసారం కానున్నాయి. మొత్తంగా ఈ రెండు ప్రోగ్రామ్‌ల టీఆర్పీ విషయంలో ఆయా ప్రోగ్రామ్స్ నిర్వాహకులకు పెద్ద దెబ్బ పడే అవకాశాలు పుష్ఖలంగా ఉన్నాయి.
మొత్తంగా ఎన్టీఆర్ షో వల్ల నాగ్ హోస్ట్ చేస్తోన్న ‘బిగ్‌బాస్’ దెబ్బ పడే అవకాశం ఉందా. లేకపోతే.. నాగ్ షో వల్ల ‘ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’కు టీఆర్పీ తగ్గుతుందా అనేది చూడాలి.ఇమేజ్ సంగతి చూస్తే.. ఎన్టీఆర్, నాగార్జునకు అసలు పోల్చి చూడలేం. కానీ యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ కు మాస్‌లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..
నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ఎన్టీఆర్ ఇపుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు స్టార్ మా ఛానెల్‌లో ఇప్పటి వరకు మూడు సీజన్లు ప్రసారం అయ్యాయి. నాగార్జున హోస్ట్ చేసిన రెండు సీజన్లు సక్సెస్ అయితే.. చిరంజీవి చేసిన సీజన్ 3 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్లు ఈ ప్రోగ్రామ్ పై పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దాంతో జెమిని టీవీ వాళ్లు ఎన్టీఆర్‌తో ఈ ప్రోగ్రామ్‌ను చేసారు. మరి ఎన్టీఆర్ తన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రసారమైన ఎపిసోడ్స్ ప్రేక్షకుల్లో చొచ్చుకుపోయింది.
ఇక నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌ను ఇపుడు ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా హోస్ట్ చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకుల మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు. మొత్తంగా అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్.. తారక్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌ల ో నాగార్జున ఇపుడు ఒకేసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Evaru Meelo Koteeswarulu, Jr ntr, Nagarjuna Akkineni, Tollywood