NAGARJUNA TWEETS THAT NEWS OF NAGACHAITANYA SAMANTHAS COMMENTS ON DIVORCE IS UNTRUE SNR
చైతు,సమంత డైవర్స్ ఇష్యూలో కింగ్ రియాక్షన్ ..నాగ్ మళ్లీ ఏమన్నాడు..
ప్రతీకాత్మకచిత్రం
Nagarjuna: సమంత, నాగచైతన్య డైవర్స్ విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు అక్కినేని నాగార్జున. నేను అన్నట్లుగా పుకార్లను వార్తలుగా ప్రచారం చేయవద్దని నాగార్జున ట్వీట్ చేశారు.
సినిమా పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్ల మధ్య ఏ చిన్న ఇష్యూ జరిగినా..దానిపైన అనేక రకాల స్టేట్మెంట్లు, కథనాలు, పుకార్లు రావడం కామన్. అక్కినేని నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య(Nagachaitanya), సమంత (Samantha)విడాకుల విషయంలో ఇదే జరిగింది. ఆ స్టార్ కపుల్స్ డైవర్స్ (divorce)తీసుకుంటున్నారని వార్త వచ్చిన నాటి నుంచి ఇవాళ్టి వరకూ అదే జరుగుతూ వస్తోంది. ఒకటి రెండ్రోజుల నుంచి మీడియాలో వింటున్న వార్తలపై నాగార్జున (Nagarjuna)స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలుగా ప్రచారమవుతున్న న్యూస్ అంతా అర్దం లేనిదని, ఆ స్టేట్మెంట్ తాను ఇవ్వలేదని అంతా అబద్దం (Untrue)అంటూ ట్వీట్ tweetచేశారు నాగార్జున. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని ఖండించారు. దయచేసి పుకార్లను వార్తలుగా ప్రచారం చేయడం మానుకోవాలని మీడియా (Media)మిత్రులను రిక్వెస్ట్ చేశారు నాగార్జున. నాగచైతన్య, సమంత విడిపోతున్నారనే వార్త వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఏదో తెలియని ఫీలింగ్..ఆసక్తి కనిపిస్తోంది. దాన్ని తగినట్లుగానే సమంత పోస్ట్ చేస్తున్న ట్వీట్లు, ఇన్స్టాలో షేర్ చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు కొన్ని వార్తలకు బలాన్ని చేకూర్చే విధంగా మారాయి. లేటెస్ట్గా సమంత చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో 'త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..' అంటూ ఓ కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని తర్వాతే నాగార్జున పేరుతో మరో వార్త బయటకు వచ్చింది.
పుకార్లను వార్తలుగా మార్చకండి..
నాగార్జున అన్నట్లుగా ప్రచారంలో ఉన్న వార్త కూడా అందుకు తగినట్లుగానే ఉండటంతో తెగ వైరల్ అయింది. నాగచైతన్య, సమంత ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్లని..నాలుగేళ్ల వైవాహిక జీవితంలో వాళ్లిద్దరి మధ్య విడిపోయే అంత సమస్య నాకు తెలిసి రాలేదని..అంతకు ముందు న్యూఇయర్ వేడుకలు కలిసే సంతోషంగా జరుపుకున్నారని తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది. కచ్చితంగా అదేంటో నాకు తేలియదని ..కానీ విడాకులు కావాలని ముందుగా సమంతనే కోరిందని నాగార్జున చెప్పినట్లుగా ఓ వార్త ప్రచారం జరిగింది. అలా తాను అనలేదని ట్వీట్ చేశారు నాగార్జున.
The news in social media and electronic media quoting my statement about Samantha & Nagachaitanya is completely false and absolute nonsense!!
I request media friends to please refrain from posting rumours as news. #GiveNewsNotRumours
సెలబ్రిటీలకు ఈ బాధలు తప్పవా..
సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో వాళ్లంతట వారు స్పందిస్తే తప్ప ఏది నిజమో..ఏది అబద్ధమో నమ్మలేనంతగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చైతు- సమంత డైవర్స్ మ్యాటరే కాదు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య- ధనుష్ విడాకుల విషయంలో కూడా ప్రస్తుతం ఇలాంటి వార్తలే తెగ వైరల్ అవుతున్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.