Home /News /movies /

NAGARJUNA THE GHOST MOVIE AN INTENSE GLIMPSE INTO HOW KING NAGARJUNA AND SONAL CHAUHANS TRANSFORMATION FOR THE GHOST BEGUN TA

Nagarjuna - The Ghost: నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ మేకింగ్ విజువల్స్ విడుదల..

నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ యాక్షన్ వీడియో (Twitter/Photo)

నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ యాక్షన్ వీడియో (Twitter/Photo)

Nagarjuna - The Ghost | కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ వీడియోను విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌తో పాటు టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగెలా చేసాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. ఆ ఊపుతోనే ఇపుడు నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమా చేస్తున్నారు.

    బంగార్రాజు సినిమాతో పాటు రీసెంట్‌గా ’బ్రహ్మాస్త్ర’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ఓవరాల్‌గా ఫ్లాప్ అయినా.. తెలుగులో మాత్రం మంచి లాభాలనే తీసుకొచ్చింది. టాలీవుడ్‌లో ఈ సినిమా సక్సెస్ వెనక నాగార్జున ఉన్నాడనే చెప్పాలి. నాగ్ కారణంగా ఈ సినిమాకు తెలుగులో మంచి లాభాలు వచ్చాయి. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘ది ఘోస్ట్’ మూవీలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో (The Ghost Glimps) నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్ళింది. ఈ వీడియో 'ది ఘోస్ట్' సినిమాపై ఉన్న అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం నాగార్జునతో పాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఎలా కష్టపడింది అనేది తాజాగా విడుదల చేసిన ఇంటెన్స్ గ్లింప్స్‌లో చూపెట్టారు. ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. అప్పట్లో 1988లో ఇదే రోజున నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ విడుదలై సంచలన విజయం సాధించింది. అదే తరహాలో ‘ది ఘోస్ట్’ మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక  ఈ సినిమాతో పాటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఉంది. మరోవైపు మంచు విష్ణు ‘జిన్నా’, బెల్లంకొండ గణేష్..‘స్వాతి ముత్యం’ సినిమాలు కూడా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానున్నాయి. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమపార్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.శతృవులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు పేరు కోసమే కాదు.. ఎంతో మంది దేశం కోసం అజ్ఞాతంగా పనిచేస్తున్నారు. వారందరినీ ఉద్దేశించి ‘ఘోస్ట్’ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nagarjuna Akkineni, Sonal chauhan, The Ghost Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు