అక్కినేని నాగార్జున.. అగ్ర కథానాయకుడే కాదు.. నిర్మాత కూడా. డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా ఉంది. ఎగ్జిబిటర్స్ కష్టాలు తెలిసినవాడు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల థియేటర్స్ మూతపడ్డ సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చునని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. ఇలాంటి తరుణంలో ప్రజలు థియేటర్స్‌కు రావడానికి కాస్త ముందు, వెనుకగా ఉన్నారు. సోలో బ్రతుకే సో బెటర్, వి, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు మాత్రం థియేటర్స్‌కు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరో సినిమా వస్తే బావుంటుందని థియేటర్స్ అనుకుంటున్నాయి. ఎందుకంటే స్టార్ హీరో సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్‌కు రావడానికి కాస్త ఆసక్తి చూపిస్తారు. ఆ అగ్ర హీరో ఎవరా అని ఆశగా థియేటర్స్ వారుఎదురు చూస్తున్న తరుణంలో నాగార్జునకు తన సినిమా ‘వైల్డ్ డాగ్’ను థియేటర్స్‌లో తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. నిర్మాతలకు ఓటీటీలో బెస్ట్ ప్రైజ్ డీల్ వచ్చిందని కామ్‌గా ఉండిపోయాడు.
నాగార్జున వంటి స్టార్ అడిగితే నిర్మాత కాదనడు. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతాడు. కానీ నాగార్జున ఏం పట్టించుకోలేదన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘వైల్డ్ డాగ్’ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.27 కోట్ల డీల్ ఇచ్చిందట. దీంతో నిర్మాతలు ‘వైల్డ్ డాగ్’ సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్‌లోనే విడుదల చేయడానికి ఓకే చేశారట.
‘వైల్డ్ డాగ్’ మూవీలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. దియామీర్జా హీరోయిన్గా నటిస్తుంది. సయామీ ఖేర్ ఇందులో నాగార్జున యాక్షన్ టీం మెంబర్‌గా కనిపించనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.