బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజాకు నాగార్జున సర్ప్రైజ్ గిప్ట్..

స్మాల్ స్క్రీన్ బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్3 సక్సెస్‌పుల్‌గా పూర్తి చేశారు హీరో అక్కినేని నాగార్జున. తాజాగా ఈయన ఆలీరెజాకు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు.

news18-telugu
Updated: December 18, 2019, 9:06 AM IST
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజాకు నాగార్జున సర్ప్రైజ్ గిప్ట్..
ఆలీ రెజాకు నాగార్జున సర్ఫ్రైజ్ గిప్ట్ (Twitter/Photo)
  • Share this:
స్మాల్ స్క్రీన్ బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్3 సక్సెస్‌పుల్‌గా పూర్తి చేశారు హీరో అక్కినేని నాగార్జున. ఎన్టీఆర్, నాని వంటి హోస్ట్‌లకు ధీటుగా తన వంతుగా ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయడంలో కీ రోల్ పోషించారు. మొత్తంగా 100 రోజులకు పైగా ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ షోలో నాగార్జున కంటెస్టెంట్స్‌ను ఓ వైపు ఉత్సాహపరుస్తూనే.. మరోవైపు తనదైన శైలిలో క్లాసులు కూడా పీకాడు. ఇక ఈ ప్రోగ్రామ్‌లో తనదైన ఆటిట్యూట్‌తో అట్రాక్ట్ చేసిన ఆలీ రెజాకు నాగార్జున ఒక సర్ప్రైజ్ గిప్ట్ అందజేశాడు. ఈ గిఫ్ట్‌ విషయానికొస్తే.. బిగ్‌బాస్ షో వీకెండ్‌లో ఓ సారి నాగ్ ధరించిన బ్రాండెడ్ షూ కావాలని ఆలీ రెజా అడిగాడు. షో అయిపోయిన ఇన్ని రోజులకు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న నాగార్జున.. ఆలీ రెజాను పిలిచి బ్రాండెడ్ షూస్‌ను గిప్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆలీ రెజా ఆనందంతో ఉబ్బితబ్చియ్యాడు. ఈ సందర్భంగా నాగార్జునకు థ్యాంక్స్ చెబుతూ.. ఆయనతో షూస్ తీసుకుంటూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఆలీ రెజా.. షో విజేతగా నిలవకపోయినా.. అందరి మనసులు గెలుచుకున్నాడు. అయితే ఒకసారి హౌస్ లోంచి బయటకు వెళ్లిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా.. బిగ్‌బాస్ విజేత కాలేకపోయాడు. 

View this post on Instagram
 

Truly a man of his word! Nag sir gifted me a pair of his favourite brand of shoes. I'd asked him for these shoes while I was in the Bigg Boss house and here it is, as promised ? . Love you Nag sir ? you're the best . ??


A post shared by Ali Reza (@i.ali.reza) on
First published: December 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు