NAGARJUNA STRONG ADVISES TO SAMANTHA AKKINENI ON NAME OF THE FAMILY MAN 2 SERIES NR
Akkineni Samantha: వివాదాలకు దూరంగా ఉండమ్మా.. అక్కినేని కోడలికి సలహా ఇచ్చిన స్టార్ హీరో!
Akkineni Samantha
Akkineni Samantha: అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో బాగా బిజీగా మారింది.
Akkineni Samantha: అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో బాగా బిజీగా మారింది. ఇదిలా ఉంటే చాలావరకు సమంత తన మామగారు నాగార్జున మాటలకు విలువ ఇస్తుందని పలు ఇంటర్వ్యూలలో తాము పాల్గొన్నప్పుడు తెలిపారు.
రాజ్ డీకే దర్శకత్వంలో స్ట్రీమింగ్ కానున్న 'ది ఫ్యామిలీ మాన్ 2' వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్రలో నటించింది. ఇక ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కాగా బాగా ఆకట్టుకోగా మరికొందరు ప్రేక్షకులు ఈ సిరీస్ పట్ల వ్యతిరేకంగా స్పందించారు. దీంతో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సిరీస్ విడుదల గురించి పలు అనుమానాలు కూడా ఏర్పడ్డాయి. ఈ సిరీస్ లో తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారని తమిళులు తీవ్రమైన అభ్యంతరాలు చేశారు.
ఈ సిరీస్ ను విడుదల కానివ్వకుండా ఓ అధికార మంత్రికి లేక కూడా రాశారు. ఇక ఈ వివాదం గురించి డైరెక్టర్ రాజ్ స్పందించగా.. ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండవని, ఈ సిరీస్ విడుదల వరకు వేచి ఉండాలని తెలిపారు. కానీ నిజానికి ఇందులో సమంత పాత్ర కు మంచి స్పందన రాగా.. ఇప్పటి వరకు ఈ వివాదం గురించి సమంత నుండి ఎటువంటి స్పందన రాలేదు.
ఇక ఈ నేపథ్యంలో పలురకాల ఊహలు ఎదురవ్వగా.. ఈ సిరీస్ వల్ల కోలివుడ్ లో సమంత కు ఎటువంటి ఆటంకం రాకూడదని బహుశా స్పందించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సమంత ప్రస్తుతం కోలీవుడ్ లో మరో రెండు సినిమాలో నటిస్తున్నందుకు వాటి విడుదల విషయంలో అడ్డంకులు రాకూడదని అందుకే ఈ వాదనలకు స్పందించటం లేదని తెలుస్తుంది. ఇక నాగార్జున కూడా సమంతని ఈ వివాదాలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చినట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.