• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGARJUNA SPECIAL INVITATION FOR NTR NANI FOR BB 4 GRAND FINALE MNJ

Nagarjuna Akkineni: గ్రాండ్ ఫినాలేకు నాగార్జున స్పెషల్ ప్లాన్.. ఆ ఇద్దరికి స్పెష‌ల్ ఇన్విటేషన్

Nagarjuna Akkineni: గ్రాండ్ ఫినాలేకు నాగార్జున స్పెషల్ ప్లాన్.. ఆ ఇద్దరికి స్పెష‌ల్ ఇన్విటేషన్

నాగార్జున

బిగ్‌బాస్ 4(Bigg Boss 4 Telugu) ముగింపుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నాగార్జున(Akkineni Nagarjuna) వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించే ఈ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం ఫినాలే అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే నిర్వాహ‌కులు

  • Share this:
    Bigg Boss 4 Grand Finale: బిగ్‌బాస్ 4 ముగింపుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నాగార్జున వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించే ఈ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం ఫినాలే అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే నిర్వాహ‌కులు అన్ని ఏర్పాట్లను చేసేశారు. దీంతో కౌంట్‌డౌన్ కూడా ప్రారంభం కాగా మరోవైపు బిగ్‌బాస్ విన్న‌ర్ ఎవ‌రో తెలుసుకునేందుకు వీక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లు తెలుస్తోంది. గ‌త సీజ‌న్‌లో కూడా చిరంజీవినే ముఖ్య అతిథిగా రాగా.. ఈ సారి కూడా ఆయ‌నే రాబోతున్న‌ట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు.

    ఇదిలా ఉంటే ఈ సీజ‌న్ గ్రాండ్ ఫినాలే కోసం నాగార్జున స్పెష‌ల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మొద‌టి, రెండ‌వ సీజ‌న్‌కి వ్యాఖ్య‌త‌లుగా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్, నానిల‌ను నాగార్జున ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. ఈ ఇద్ద‌రు హీరోల‌తో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని స్వ‌యంగా నాగార్జున‌నే ఆహ్వానించిన‌ట్లు టాక్. ఇక నాగ్ ఆహ్వానంపై ఆ ఇద్ద‌రు పాజిటివ్‌గానే స్పందించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సీజ‌న్‌కి ఎవ‌రెవ‌రు చీఫ్ గెస్ట్‌లుగా రాబోతున్నారు..? తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 grand Finale, Bigg Boss 4 guests, Nagarjuna NTR Nani, Nagarjuna Chiranjeevi Bigg Boss, Bigg Boss 4 Telugu winner
    ఎన్టీఆర్ నాని


    కాగా ఈ సీజ‌న్‌లో అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సొహైల్, మోనాల్, లాస్య, మెహబూబ్, రాజశేఖర్, నోయల్, దివి, సుజాత, గంగవ్వ, దేవి నాగవల్లి, కరాటే కల్యాణి, సూర్యకిరణ్ పాల్గొనగా.. కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సొహైల్‌లు ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు