కరోనాపై శివమణి డైలాగ్స్ స్పూఫ్ వీడియో.. షేర్ చేసిన నాగార్జున..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్న కరోనా వైరస్‌ అనే మహామ్మారితో పోరాడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని శివమణి చిత్రంలోని డైలాగ్స్‌ని కరోనా పై అవగాహన పెంచేలా  రెడీ చేసి వదిలారు.

news18-telugu
Updated: April 25, 2020, 2:42 PM IST
కరోనాపై శివమణి డైలాగ్స్ స్పూఫ్ వీడియో.. షేర్ చేసిన నాగార్జున..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగార్జున ‘శివమణి’డైలాగులు (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్న కరోనా వైరస్‌ అనే మహామ్మారితో పోరాడుతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో కరోనా వైరస్‌ తగ్గకపోవడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఈ వైరస్ ‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేరడీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జోకులు, పేరడీలో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘శివమణి’. ఈ సినిమాలో నాగార్జున నా కొంచెం మెంటల్ అంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ సినిమాలోని శివమణి చిత్రంలోని డైలాగ్స్‌ని కరోనా పై అవగాహన పెంచేలా  రెడీ చేసి ప్రేక్షకులపై సందించారు. ఇది హీరో నాగార్జునకు నచ్చడంతో ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసాడు. ఇపుడు నేను శివమణి సినిమాను చూస్తే.. పూరీ జగన్నాథ్ డైలాగ్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుందని నాగార్జున తన ట్వీట్‌లో రాసుకొచ్చారున. అయితే వీడియోలో వాయిస్‌ను భవిరి రవి అనే వ్యక్తి అచ్చం నాగార్జునలా మిమిక్రీ చేశారు. సీన్స్ తగ్గట్టు డైలాగ్స్ కూడా కూడా రాసుకున్నారు. ఇపుడీ వీడియో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.

Published by: Kiran Kumar Thanjavur
First published: April 25, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading