స‌మంత‌తో నాగార్జున స‌ర‌దా.. కోడ‌లి పిల్ల‌తో షూటింగ్ చేస్తున్న మామ‌గారు..

పెళ్లి చేసుకున్నా కూడా స‌మంత ఇమేజ్ మాత్రం ఇంత కూడా త‌గ్గ‌లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌ర్వాత స‌మంత క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇప్ప‌టికీ ఈమెతో న‌టించ‌డానికి హీరోలు సిద్ధంగా ఉన్నారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2019, 3:24 PM IST
స‌మంత‌తో నాగార్జున స‌ర‌దా.. కోడ‌లి పిల్ల‌తో షూటింగ్ చేస్తున్న మామ‌గారు..
మన్మథుడు 2 షూటింగ్ పిక్
  • Share this:
పెళ్లి చేసుకున్నా కూడా స‌మంత ఇమేజ్ మాత్రం ఇంత కూడా త‌గ్గ‌లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌ర్వాత స‌మంత క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇప్ప‌టికీ ఈమెతో న‌టించ‌డానికి హీరోలు సిద్ధంగా ఉన్నారు.. ఇక ద‌ర్శ‌కులు కూడా ఇప్ప‌టికీ ఈమె కోసం క‌థ‌లు సిద్ధం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు స‌మంత ఇమేజ్ నాగార్జునకు కూడా ప‌నికొచ్చేలా క‌నిపిస్తుంది. కోడ‌లు క్రేజ్ త‌న సినిమా కోసం వాడుకుంటున్నాడు నాగ్. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ మ‌న్మ‌థుడు 2లో క‌లిసి న‌టిస్తున్నారు. గ‌తంలో ఈ ఇద్ద‌రూ క‌లిసి మ‌నం, రాజు గారి గ‌ది 2 లాంటి సినిమాల్లో న‌టించారు.

Nagarjuna shared a pic with Samantha Akkineni from the sets of Manmadhudu 2 and says that happy to act with kodalu pilla pk.. పెళ్లి చేసుకున్నా కూడా స‌మంత ఇమేజ్ మాత్రం ఇంత కూడా త‌గ్గ‌లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌ర్వాత స‌మంత క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇప్ప‌టికీ ఈమెతో న‌టించ‌డానికి హీరోలు సిద్ధంగా ఉన్నారు.. samantha akkineni,samantha akkineni twitter,nagarjuna twitter,manmadhudu 2 movie twitter,manmadhudu 2 movie shooting,samantha akkineni nagarjuna,samantha akkineni nagarjuna movies,samantha akkineni hot photos,samantha akkineni in manmadhudu 2,samantha nagarjuna manmadhudu 2 movie,manmadhudu 2 movie shooting,samantha anushka shetty,telugu cinema,సమంత అక్కినేని,సమంత నాగార్జున,మన్మథుడు 2లో సమంత అక్కినేని,సమంత నాగార్జున మన్మథుడు 2,తెలుగు సినిమా
నాగార్జున సమంత


మూడోసారి ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 కోసం జోడీ క‌డుతున్నారు నాగార్జున‌, స‌మంత‌. మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్ గా మన్మథుడు 2 తెర‌కెక్కుతుంది. త‌న సొంత సంస్థ అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు నాగార్జున‌. చిల‌సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే పోర్చుగ‌ల్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయింది చిత్ర‌యూనిట్. అందులో భాగంగానే విడుద‌లైన కొన్ని స్టిల్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున‌, స‌మంత పిక్ ఇప్పుడు పిచ్చెక్కిస్తుంది.
హీరోయిన్‌గా ర‌కుల్ న‌టిస్తుంటే.. స‌మంత అక్కినేని మాత్రం కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఈ పాత్ర కోసం ముందు అనుష్క‌ను అనుకున్నా కూడా స‌మంత‌ను తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్. పైగా స‌మంత‌కు రాహుల్ మంచి స్నేహితుడు. మ‌న్మ‌థుడు 2లో క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర ఇది. మామా కోడ‌ళ్లు క‌లిసి న‌టిస్తే సినిమాకు కూడా క్రేజ్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా నాగార్జున‌కు స్యామ్ గొడుగు ప‌ట్టుకుని ఉన్న పోజ్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. మొత్తానికి మామాకోడ‌ళ్లు క‌లిసి న‌టిస్తున్న సినిమా ఎంత‌వ‌ర‌కు మాయ చేస్తుందో చూడాలి.
First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com