తారక్ సాక్షిగా అఖిల్‌కు క్లాస్ పీకిన నాగార్జున

Mr.మజ్ను | రీసెంట్‌గా జరిగిన Mr.మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున..జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుకగా నాగార్జున, అఖిల్‌కు క్లాస్ పీకాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 20, 2019, 2:05 PM IST
తారక్ సాక్షిగా అఖిల్‌కు క్లాస్ పీకిన నాగార్జున
Mr.మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని హీరోలతో తారక్
  • Share this:
రీసెంట్‌గా జరిగిన Mr.మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున..జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Mr.మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాలేదు. అతను మా కుటుంబ సభ్యుడే. నాకు తారక్ పెద్ద కుమారుడు లాంటి వాడు. తనను ఎపుడు కలిసిన అప్యాయంగా బాబాయి అని పిలుస్తుంటాడు అని Mr.మజ్ను ఆడియో వేడుకలో నాగార్జున..తారక్‌తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు Mr.మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా..అఖిల్‌కు కొన్ని చురకలు అంటించాడు నాగార్జున. అఖిల్..ఎన్టీఆర్‌లో ఉన్న మాస్, డాన్స్ నేర్చుకో అని ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సినిమాతో అఖిల్ ఖచ్చితంగా హిట్ కొట్టడం గ్యారంటీ అని నాగార్జున చెప్పుకొచ్చాడు.

Mr.మజ్ను సినిమా విషయానికొస్తే..వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలో అఖిల్ ప్లే బాయ్ తరహా పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

పూనం పాండే ఫోటోలు



ఇవి కూడా చదవండి 

రజినీకాంత్ పేటలోకి రాజమౌళి ఎంట్రీమరోసారి ఆ స్టార్ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్..

96 తెలుగు రీమేక్‌లో సమంత ? హీరో అతనేగా..

 
First published: January 20, 2019, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading