నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి ‘దొంగ’ టీజర్..

ఈయేడాది ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి.. నెక్ట్స్ ‘దొంగ’ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నాగార్జున విడుదల చేసారు.

news18-telugu
Updated: November 16, 2019, 11:53 AM IST
నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి ‘దొంగ’ టీజర్..
కార్తి ‘దొంగ’ టీజర్ విడుదల (twitter/photo)
  • Share this:
ఈయేడాది ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి.. నెక్ట్స్ ‘దొంగ’ సినిమాతో పలకరించబోతున్నాడు. మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. నిజ జీవితంలో వదినా మరది అయిన జ్యోతిక,కార్తిలు ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల పాత్రలో నటించారు. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను టీజర్‌ను నాగార్జున లాంఛ్ చేసారు. ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌తో పాటు కాస్త అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. చిన్నపుడు తప్పిపోయిన అక్క నుంచి విడిపోయిన తమ్ముడు దొంగ అవుతాడు. ఒక్కో చోట ఒక్కో పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. అలా చిన్నపుడు తప్పిపోయిన తమ్ముడు అక్కను ఎలా చేరకున్నాడు. అప్పటి వరకు దొంగగా ఉన్న హీరో ఎలా మంచివాడిగా మారాడనే నేపథ్యంలో   ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కార్తి లుక్‌ కొత్తగా ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేసారు.First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు