Akhil Akkineni : కొడుకు భవిష్యత్తు కోసం ఏ తండ్రి చేయని త్యాగం చేసిన నాగార్జున..

Nagarjuna and Akhil Photo : Twitter

Akhil Akkineni : అక్కినేని అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    Akhil Akkineni : అక్కినేని అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు మొదట ఈ పాత్ర కోస నాగార్జునను అనుకున్నారట. అంతేకాదు ఆయన్ను ఆ పాత్ర చేయాలనీ కోరగా.. నాగార్జున సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం ఉంది.. ఒక వేళా నాగార్జున అఖిల్ సినిమాలో నటిస్తే ప్రేక్షకుల ఫోకస్ అంతా తనపై పడుతుందని భావించిన నాగార్జున ఇది అఖిల్ కెరీర్‌కు ఉపయోగపడదని భావించి తప్పుకున్నారట. అందులో భాగంగానే ఆ తర్వాత ఆ కీలకపాత్ర కోసం మమ్ముటీని సంప్రదించిందట చిత్రబృందం. ఇక అఖిల్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కోసం సూపర్ స్టైలీష్‌గా మేకోవర్ అయ్యారు. ఇక మరోవైపు ఆయన గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో ఆయన ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు.

    ఏజెంట్ విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్‌ను నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో జరుపుతున్నారు. అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశారు. ఇప్పటికే అక్కడ కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించింది చిత్రబృందం. ఈ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్‌లో మరో కీలక షెడ్యూల్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 24న విడుదలకానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక అఖిల్ నటించిన మరో చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్స్‌లో విడుకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: