Nagarjuna-Ram Charan | అప్పటి తరంలో నాగార్జునకు.. ఇప్పటి తరంలో రామ్ చరణ్ మాత్రమే ఈ రేర్ ఫీట్ రికార్డు సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అప్పట్లో తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కోసం నాగార్జున.. ఇప్పట్లో నాన్నమెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తారు. రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లో ప్రవేశించిన తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకదు నిర్మాతగా తన ఇంటి పేరు మీద కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌ను స్టార్ట్ చేసిన తండ్రి చిరుతో వరుసగా ‘ఖైదీ నంబర్ 150, ‘సైరా నరిసింహా రెడ్డి ’ సినిమాలు నిర్మించారు. ఇపుడు ముచ్చటగా మూడో చిత్రం ‘ఆచార్య’ను నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో తండ్రితో తెరను పంచుకున్నాడు. దాంతో పాటు రాబోయే ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ .. సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రకంగా హీరోగా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ చరణ్.
ప్రస్తుతం రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు లైన్లో పెట్టాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించినా.. ఈ సినిమాను వచ్చే యేడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. దాని కంటే ముందు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాను ఎపుడు విడుదల చేస్తారనేది చూడాలి. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే.. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
అటు నాగార్జున విషయానికొస్తే.. ఈయన కూడా తండ్రి నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు బాటలో సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు నిర్మాతగా అన్నపూర్ణ స్డూడియో పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక నాగార్జున కూడా అప్పట్లో తండ్రి నాగేశ్వరరావు హీరోగా ‘ప్రేమాభిషేకం’ ‘ శ్రీరంగనీతులు’, బుచ్చిబాబు’ శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ తో పాటు మనం వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించాడు. ఈ రకంగా వీళ్లిద్దరు తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోలుగా రికార్డులకు ఎక్కారు.
అటు మరో దివంగత హీరో హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్ హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన ఫుల్ టైమ్ హీరోగా పనిచేయలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. నాగార్జున ఒక అడుగు ముందుకేసి తన ఇద్దరు కొడుకులు, మేనల్లుళ్లతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది.
ఈ రకంగా తండ్రి హీరోగా సినిమాలు నిర్మించిన కథానాయకుల లిస్టులో వీళ్లిద్దరు చోటు సంపాదించుకున్నారు. మిగతా హీరోలకు ఈ ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేము. ఏమైనా అప్పట్లో నాగార్జున... ఈ జనరేషన్లో రామ్ చరణ్‌కు మాత్రమే ఈ అరుదైన రేర్ రికార్డు సాధ్యమైందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
’ఆహా’ కొత్త ఆఫీసులో సందడి చేసిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ..
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ANR, Chiranjeevi, Harikrishna, Nagarjuna Akkineni, NTR, Ram Charan, Tollywood