Home /News /movies /

NAGARJUNA NAGA CHAITANYAS BANGARRAJU MOVIE SHOCKS AP GOVERNMENT NIGHT CURFEW AND 50 PERCENT OCCUPANCY TA

Bangarraju : ‘బంగార్రాజు’కు కోలుకోలేని దెబ్బ.. ఆ విషయంలో నాగార్జున అప్‌‌సెట్..

బంగార్రాజు మూవీ (Bangarraju Photo :Twitter)

బంగార్రాజు మూవీ (Bangarraju Photo :Twitter)

Nagarjuna - Naga Chaitanya - Bangarraju : ‘బంగార్రాజు’కు కోలుకోలేని దెబ్బ.. ఆ విషయంలో నాగార్జున అప్‌‌సెట్ అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా..

  Bangarraju : ‘బంగార్రాజు’కు కోలుకోలేని దెబ్బ.. ఆ విషయంలో నాగార్జున అప్‌‌సెట్ అవుతున్నారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సహా పలు బడా సినిమాలు విడుదలవుతున్న తగ్గేదేలే అంటూ పొంగల్ పోటీలో నేనున్నాను అంటూ నాగార్జున రంగంలోకి దిగారు. తీరా సంక్రాంతి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’,(RRR) ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమాలు కరోనా కారణంగా వాయిదా వేసారు. ఈ రెండు సినిమాలు ప్యాన్ ఇండియా మూవీస్ కావడం.. ఇప్పటికే  ఓమైక్రాన్ రూపంలో కరోనా మన దేశంపై విరుచుకుపడటంతో పాటు.. పలు రాష్రాల్లో సగం ఆక్యుపెన్షీతో థియేటర్స్ రన్ చేస్తుండంతో ఈ సినిమాలను అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. నాగార్జున ‘బంగార్రాజు’ మూవీకి ఇది కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

  బంగార్రాజు మూవీలో నాగ చైతన్య, నాగార్జునలు మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు ఆడియన్స్ నుండి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బంగార్రాజు జనవరి 14న విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది ఇక బంగార్రాజు విషయానికి వస్తే.. షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.  ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల నలబై నిమిషాల నిడివితో రానుంది.

  Unstoppable with NBK : సమరసింహా రెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి.. బాలయ్య షోలో లైగర్ టీమ్ సందడి..

  మరోవైపు నాగార్జున.. ‘బంగార్రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీలో టికెట్ ధరల విషయంలో మాములుగానే స్పందించారు. నా సినిమాకు అక్కడి రేట్స్ సరిపోతాయనే కామెంట్స్ పై సినీ ఇండస్ట్రీ పెద్దలు నాగ్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో కరోనా కేసులో రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో అక్కడ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరోవైపు అన్ని థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్షీతో రన్ చేయాలనే రూల్ తీసుకొచ్చారు. అంటే థియేటర్స్‌లో సీటుకు సీటుకు మధ్య ఒక ఖాళీ ఉండాలి. ప్రతి ఒక్క థియేటర్ యాజమాన్యం వీటిగా విధిగా పాటించాలన్నారు. లేకపోతే.. థియేటర్స్ లైసెన్స్ కాన్సిల్ చేసి సీజ్ చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  Mahesh Babu -Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ ఆ రికార్డు.. రమేష్ బాబుకు సాధ్యమైంది..

  మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్రాంతికి బరిలో దిగుతున్న నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. నైట్ కర్ఫ్యూ మూలంగా రోజుకు మూడు షోలకు మించి ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు సగం ఆక్యపెన్షీ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తంగా రూ. 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఏపీ ప్రభుత్వ నియమ నిబంధలనకు అనుగుణంగా టార్గెట్ రీచ్ కావడం అంత ఈజీ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. నాగార్జున కెరీర్‌లో ఇది హైయెస్ట్ బిజినెస్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా వసూళ్లను రాబట్టనుందో.

  ANR - Dharmapatni : అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ‘ధర్మపత్ని’ విడుదలై 81 యేళ్లు పూర్తి..


  బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

  HBD Allu Aravind : హ్యాపీ బర్త్ డే అల్లు అరవింద్‌.. బావ చిరంజీవితో ఈయనది బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

  ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు. . రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. మరో ఆరుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ బంగార్రాజు సినిమాలో నటించారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bangarraju, Krithi shetty, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Ramya Krishna, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు