Home /News /movies /

NAGARJUNA NAGA CHAITANYA SANKRANTI MOVIE BANGARRAJU 5 DAYS WW COLLECTIONS AND HUGE DROPS ON 5TH DAY PK

Bangarraju 5 days WW collections: ‘బంగార్రాజు’ 5 డేస్ కలెక్షన్స్.. తగ్గిన జోరు.. పడిన కరోనా ప్రభావం..

బంగార్రాజు కలెక్షన్స్ (Bangarraju collections)

బంగార్రాజు కలెక్షన్స్ (Bangarraju collections)

Bangarraju 5 days WW collections: సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. దీనికి ముందు 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున (Bangarraju 5 days WW collections) కెరీర్‌లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు.

ఇంకా చదవండి ...
తొలి నాలుగు రోజులు ఎదురు లేకుండా సాగిన బంగార్రాజు జోరు ఐదో జోరు తగ్గిపోయింది. కోవిడ్ ప్రభావంతో పాటు ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కలెక్షన్స్‌పై దారుణమైన ప్రభావం చూపించాయి. దాంతో ఐదో రోజు చాలా చోట్ల భారీ డ్రాప్స్ కనిపించాయి. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకున్న అక్కినేని హీరోలు.. ఆ తర్వాత మాత్రం అదే జోరు చూపించలేకపోతున్నారు. ఏ నమ్మకంతో అయితే నాగార్జున ఈ సినిమాను విడుదల చేసాడో.. అది లెక్కల రూపంలో కనిపిస్తుంది. మొదటి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండు, మూడో, నాలుగో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు కుమ్మేస్తున్నాడు. అయితే 5వ రోజు మాత్రం కేవలం 1.94 కోట్లు మాత్రమే వసూలు చేసింది బంగార్రాజు. మీడియం రేంజ్ సినిమాలలో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం. మరి 5 రోజుల్లో బంగార్రాజు తీసుకొచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం..

Krithi Shetty - Anupama - Samantha: హ్యాట్రిక్‌తో గ్రాండ్ ఎంట్రీ.. సమంత, అనుపమ రికార్డు సమం చేసిన కృతి శెట్టి..

నైజాం: 7.45 కోట్లు
సీడెడ్: 5.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.01 కోట్లు
ఈస్ట్: 3.29 కోట్లు
వెస్ట్: 2.41 కోట్లు
గుంటూరు: 2.91 కోట్లు
కృష్ణా: 1.88 కోట్లు
నెల్లూరు: 1.46 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 29.06 కోట్లు
ఓవర్సీస్: 1.58 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 1.30 కోట్లు
వరల్డ్ వైడ్ 5 డేస్ కలెక్షన్స్: 31.94 కోట్లు షేర్

Nidhhi Agerwal remuneration: భారీగా పెంచేసిన నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ పోరీ రెమ్యునరేషన్ ఎంతంటే..?


సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. దీనికి ముందు 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున కెరీర్‌లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. మొదటి 5 రోజుల్లో 32 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 7 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుంది. ఇప్పట్నుంచి వచ్చే వసూళ్లే బంగార్రాజు ఫ్యూచర్ డిసైడ్ చేయనున్నాయి. సెలవులున్నా కూడా.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కలెక్షన్స్ వస్తాయా అనేది అనుమానమే.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bangarraju, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు