హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna Bangarraju: ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలు.. నాగార్జునతో పాటు ఆ హీరో కూడా..!

Nagarjuna Bangarraju: ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలు.. నాగార్జునతో పాటు ఆ హీరో కూడా..!

అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు ప్రీక్వెల్  చేస్తున్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. ఇప్పటికే  నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు ప్రీక్వెల్  చేస్తున్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. ఇప్పటికే  నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Nagarjuna Bangarraju: చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. నాగార్జున బంగార్రాజు (Nagarjuna Bangarraju) సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడు నాగ్. ఇందులో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. బంగార్రాజు (Bangarrju) షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రెండు బైకులు పెట్టి.. సోగ్గాళ్ళు షూటింగ్‌కు సిద్ధమయ్యారంటూ పోస్టర్ విడుదల చేసాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసాడు దర్శకుడు. 35 ఏళ్ళ నాగార్జున (Nagarjuna) కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సోగ్గాడే సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సినిమా విజయం చూడగానే దీనికి సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పుడే చేసాడు. అయితే అది పట్టాలెక్కడానికి ఐదేళ్ళు పట్టింది. మూడేళ్లుగా ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదా పడుతున్న బంగార్రాజు ఎట్టకేలకు ముహూర్తం పెట్టేసాడు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ మధ్యే మొదలైంది.

నాగ చైతన్య (Naga Chaitanya), కృతి శెట్టి (Krithi Shetty) ఇందులో మరో జోడీగా నటిస్తున్నారు. చైతూ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయంపై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బంగార్రాజు సినిమా తెరకెక్కనుంది. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ సినిమాకు రచనా సహకారం అందించారు. వాళ్లంతా కలిసి దాదాపు రెండేళ్ళ పాటు ఈ కథను సిద్ధం చేసారు. ఆగస్ట్ చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి.. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల.

నాగ చైతన్యకు ఇల్లు ఇవ్వని మురళీ మోహన్.. నాగార్జున ఫోన్‌తో..నాగార్జున కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ముందు నాగ చైతన్యకు జోడీగా సమంతను అనుకుని.. ఆ తర్వాత కృతి శెట్టిని ఖరారు చేసారు. ముహూర్త కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. తొలి భాగంలో బంగార్రాజు పై లోకం నుంచి కిందకి వచ్చి యముడి పిలుపుతో మళ్లీ పైకి వెళ్లిపోతాడు. అయితే రెండో భాగంలో స్వర్గం నుంచి మళ్లీ భూమి మీదకు వచ్చి.. ఆ తర్వాత ఏం చేసాడనేది అసలు కథ. అక్కడ్నుంచే కథ కూడా మొదలు కానుంది. ఇప్పుడు కూడా పూర్తిగా వినోదాత్మకమైన కథతోనే వస్తున్నాడు కళ్యాణ్. నేల టిక్కెట్టు ఫ్లాప్ తర్వాత కనిపించకుండా పోయిన కళ్యాణ్.. బంగార్రాజుతో తన సత్తా చూపించుకోవాలనుకుంటున్నాడు.

First published:

Tags: Akkineni nagarjuna, Bangarraju, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు