Bangarraju Teaser: 35 ఏళ్ళ నాగార్జున (Nagarjuna Bangarraju Teaser) కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయనా. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది.
35 ఏళ్ళ నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయనా. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన సోగ్గాడే సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సినిమా విజయం చూడగానే దీనికి సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు దాన్ని సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేసాడు నాగార్జున. అంటే ముందు జరిగే కథ అన్నమాట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పుడే చేసాడు. అయితే అది పట్టాలెక్కడానికి ఐదేళ్ళు పట్టింది. మూడేళ్లుగా ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదా పడుతున్న బంగార్రాజు ఇప్పుడు వచ్చేస్తున్నాడు. కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసాడు నాగార్జున. పక్కా ప్లానింగ్ ప్రకారం దర్శకుడు కళ్యాణ్ కృష్ణను కంగారు పెడుతూ.. బంగార్రాజు పని పూర్తి చేసాడు నాగార్జున. పైగా ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్నాడు. జీ స్టూడియోస్ సహ నిర్మాణ సంస్థ. నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. తాజాగా టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటే మరోసారి సోగ్గాడే చిన్నినాయన సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో చైతూ, నాగార్జున సమానంగా కనిపిస్తున్నారు. కుర్ర బంగార్రాజు పాత్రలో చైతూ నటిస్తున్నాడు. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ సినిమాకు రచనా సహకారం అందించారు. వాళ్లంతా కలిసి దాదాపు రెండేళ్ళ పాటు ఈ కథను సిద్ధం చేసారు.
2021 సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి.. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. చెప్పినట్లుగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కంటిన్యూ అవుతుంది. తొలి భాగంలో బంగార్రాజు పై లోకం నుంచి కిందకి వచ్చి యముడి పిలుపుతో మళ్లీ పైకి వెళ్లిపోతాడు. అయితే రెండో భాగంలో స్వర్గం నుంచి మళ్లీ భూమి మీదకు వచ్చి.. తన జీవితంలో ఏం జరిగింది.. అసలు తనను ఎందుకు చంపారు అనేది కథ. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచి వెనక్కి వెళ్తుంది కథ. ఇప్పుడు కూడా పూర్తిగా వినోదాత్మకమైన కథతోనే వస్తున్నాడు కళ్యాణ్. నేల టిక్కెట్టు ఫ్లాప్ తర్వాత కనిపించకుండా పోయిన కళ్యాణ్.. బంగార్రాజుతో తన సత్తా చూపించుకోవాలనుకుంటున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.