Home /News /movies /

NAGARJUNA NAGA CHAITANYA BANGARRAJU MOVIE MUHURTHAM DONE IN ANNAPURNA STUDIES PK

Nagarjuna Bangarraju: మొదలైన నాగార్జున ‘బంగార్రాజు’.. సీక్వెల్ కథ ఎలా ఉండబోతుందంటే..?

నాగార్జున బంగార్రాజు ముహూర్తం (Nagarjuna Bangarraju)

నాగార్జున బంగార్రాజు ముహూర్తం (Nagarjuna Bangarraju)

Nagarjuna Bangarraju: 35 ఏళ్ళ నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన. దీనికి సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున (Nagarjuna Bangarraju). మూడేళ్ళుగా అనుకుంటున్న ముహూర్తం ఇప్పుడు జరిగింది.

ఇంకా చదవండి ...
35 ఏళ్ళ నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సోగ్గాడే సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఈ సినిమా విజయం చూడగానే దీనికి సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పుడే చేసాడు. అయితే అది పట్టాలెక్కడానికి ఐదేళ్ళు పట్టింది. మూడేళ్లుగా ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదా పడుతున్న బంగార్రాజు ఎట్టకేలకు ముహూర్తం పెట్టేసాడు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలైంది. నాగ చైతన్య, కృతి శెట్టి ఇందులో మరో జోడీగా నటిస్తున్నారు. చైతూ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయంపై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బంగార్రాజు సినిమా తెరకెక్కనుంది. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ సినిమాకు రచనా సహకారం అందించారు. వాళ్లంతా కలిసి దాదాపు రెండేళ్ళ పాటు ఈ కథను సిద్ధం చేసారు. సెప్టెంబర్‌లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి.. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. నాగార్జున కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ముందు నాగ చైతన్యకు జోడీగా సమంతను అనుకుని.. ఆ తర్వాత కృతి శెట్టిని ఖరారు చేసారు.
nagarjuna,nagarjuna twitter,nagarjuna naga chaitanya,nagarjuna naga chaitanya bangarraju,nagarjuna naga chaitanya bangarraju movie muhurtham,naga chaitanya krithi shetty bangarraju movie,bangarraju movie shooting,బంగార్రాజు ముహూర్తం,నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు సినిమా ముహూర్తం
’సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున (Twitter/Photo)

తాజాగా ముహూర్త కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. తొలి భాగంలో బంగార్రాజు పై లోకం నుంచి కిందకి వచ్చి యముడి పిలుపుతో మళ్లీ పైకి వెళ్లిపోతాడు. అయితే రెండో భాగంలో స్వర్గం నుంచి మళ్లీ భూమి మీదకు వచ్చి.. ఆ తర్వాత ఏం చేసాడనేది అసలు కథ. అక్కడ్నుంచే కథ కూడా మొదలు కానుంది. ఇప్పుడు కూడా పూర్తిగా వినోదాత్మకమైన కథతోనే వస్తున్నాడు కళ్యాణ్. నేల టిక్కెట్టు ఫ్లాప్ తర్వాత కనిపించకుండా పోయిన కళ్యాణ్.. బంగార్రాజుతో తన సత్తా చూపించుకోవాలనుకుంటున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akkineni nagarjuna, Bangarraju, Naga Chaitanya Akkineni, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు