NAGARJUNA NAGA CHAITANYA BANGARRAJU 16 DAYS COLLECTIONS AND STILL LONG WAY TO GO FOR BREAK EVEN PK
Bangarraju 16 days collections: ‘బంగార్రాజు’ లేటెస్ట్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..?
బంగార్రాజు కలెక్షన్స్ (Twitter/Photo)
Bangarraju 16 days collections: సునామీలా మొదలైన బంగార్రాజు కలెక్షన్స్ (Bangarraju 16 days collections) జాతర ఆ తర్వాత మెల్లగా తగ్గిపోయింది. కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. కోవిడ్ ప్రభావంతో పాటు ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కలెక్షన్లపై దారుణమైన ప్రభావం చూపించాయి.
సునామీలా మొదలైన బంగార్రాజు కలెక్షన్స్ జాతర ఆ తర్వాత మెల్లగా తగ్గిపోయింది. కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. కోవిడ్ ప్రభావంతో పాటు ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కలెక్షన్లపై దారుణమైన ప్రభావం చూపించాయి. అందుకే 5వ రోజు నుంచి చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకున్న అక్కినేని హీరోలు.. ఆ తర్వాత మాత్రం అదే జోరు చూపించలేకపోతున్నారు. ఏ నమ్మకంతో అయితే నాగార్జున ఈ సినిమాను విడుదల చేసాడో.. అది మొదట్లో బాగానే వర్కవుట్ అయింది. మొదటి 3 రోజులు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. ఆ తర్వాత మాత్రం అదే దూకుడు చూపించడంలో విఫలమైంది. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉండటం.. టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో వసూళ్లు డ్రాప్ అయ్యాయి. 16వ రోజు శనివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.22 కోట్లు వసూలు చేసింది బంగార్రాజు. ప్రపంచ వ్యాప్తంగా కూడా 26 లక్షల వరకు షేర్ వచ్చింది. మరి 16 రోజుల్లో బంగార్రాజు తీసుకొచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం..
సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. ముందు ఈ సినిమాను 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున కెరీర్లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. ఇప్పటి వరకు 16 రోజుల్లో 37.49 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో కోటిన్నర వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుంది. నైజాంలో ఇప్పటికీ 3 కోట్లు వెనకబడి ఉంది బంగార్రాజు. ఇక్కడ 11.50 కోట్ల బిజినెస్ చేస్తే వచ్చింది 8.20 కోట్లు మాత్రమే. అయితే ఏపీలో మాత్రం ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాలలో లాభాలు వచ్చాయి. ఓవర్సీస్ కూడా బంగార్రాజు ఇంకా సేఫ్ కాలేదు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.