Home /News /movies /

NAGARJUNA NAGA CHAITANYA BANGARRAJU 10 DAYS COLLECTIONS AND HUGE PICK UP ON SECOND WEEKEND PK

Bangarraju 10 days collections: ‘బంగార్రాజు’ లేటెస్ట్ కలెక్షన్స్.. 10వ రోజు అనూహ్యంగా పుంజుకున్న కలెక్షన్స్..

బంగార్రాజు (Twitter/Photo)

బంగార్రాజు (Twitter/Photo)

Bangarraju 10 days collections: తొలి నాలుగు రోజులు ఎదురు లేకుండా సాగిన బంగార్రాజు (Bangarraju 10 days collections) జోరు ఐదో రోజు నుంచి తగ్గిపోయింది. 5 రోజుల తర్వాత కలెక్షన్స్ నెమ్మదిగా డ్రాప్ అవుతూ వచ్చాయి. మళ్లీ 10వ రోజు ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా పుంజుకున్నాయి.

ఇంకా చదవండి ...
తొలి నాలుగు రోజులు ఎదురు లేకుండా సాగిన బంగార్రాజు జోరు ఐదో రోజు నుంచి తగ్గిపోయింది. కోవిడ్ ప్రభావంతో పాటు ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కలెక్షన్స్‌పై దారుణమైన ప్రభావం చూపించాయి. దాంతో ఐదో రోజు చాలా చోట్ల భారీ డ్రాప్స్ కనిపించాయి. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకున్న అక్కినేని హీరోలు.. ఆ తర్వాత మాత్రం అదే జోరు చూపించలేకపోతున్నారు. ఏ నమ్మకంతో అయితే నాగార్జున ఈ సినిమాను విడుదల చేసాడో.. అది లెక్కల రూపంలో కనిపిస్తుంది. మొదటి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండు, మూడో, నాలుగో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు ఆకట్టుకున్నాడు. అయితే 5 రోజుల తర్వాత కలెక్షన్స్ నెమ్మదిగా డ్రాప్ అవుతూ వచ్చాయి. మళ్లీ 10వ రోజు ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.81 కోట్లు వసూలు చేసింది బంగార్రాజు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కోటి వరకు షేర్ వచ్చింది. మీడియం రేంజ్ సినిమాలలో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం. మరి 10 రోజుల్లో బంగార్రాజు తీసుకొచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం..

Vaisshnav Tej: ‘రంగరంగ వైభవంగా’ కొత్త సినిమా ప్రకటించిన మెగా హీరో వైష్ణవ్ తేజ్..


నైజాం: 7.92 కోట్లు
సీడెడ్: 6.30 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.73 కోట్లు
ఈస్ట్: 3.81 కోట్లు
వెస్ట్: 2.70 కోట్లు
గుంటూరు: 3.21 కోట్లు
కృష్ణా: 2.08 కోట్లు
నెల్లూరు: 1.64 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 32.39 కోట్లు
ఓవర్సీస్: 1.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 1.68 కోట్లు
వరల్డ్ వైడ్ 10 డేస్ కలెక్షన్స్: 35.49 కోట్లు షేర్

Balakrishna - Geetha Arts: గీతా ఆర్ట్స్‌లో బాలయ్య.. కళ్యాణ్ రామ్ దర్శకుడితో సినిమాకు సిద్ధం..


సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. దీనికి ముందు 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున కెరీర్‌లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. ఇప్పటి వరకు 10 రోజుల్లో 35 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 4 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుంది. నైజాంలో ఇప్పటికీ 4 కోట్లు వెనకబడి ఉంది బంగార్రాజు. ఇక్కడ 11.50 కోట్ల బిజినెస్ చేస్తే వచ్చింది 7.93 కోట్లు మాత్రమే. అయితే ఏపీలో మాత్రం ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాలలో లాభాలు వచ్చాయి. ఓవర్సీస్ కూడా బంగార్రాజు ఇంకా సేఫ్ కాలేదు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bangarraju, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు