NAGARJUNA MANMADHUDU HEROINE ANSHU NOW SETTLED AS BUSINESS WOMAN IN LONDON NR
Manmadhudu: మన్మథుడు హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
heroine anshu
Manmadhudu: ఒకప్పటి తెలుగు సినీ నటి, మన్మథుడు హీరోయిన్ అన్షు. అన్షు అంటే ఎవరు అంత గుర్తుపట్టరు కానీ.. మన్మథుడు హీరోయిన్ అంటే ఇలాగే గుర్తు పట్టేస్తారు. ఇక తన అందంతో అప్పట్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
Manmadhudu: ఒకప్పటి తెలుగు సినీ నటి, మన్మథుడు హీరోయిన్ అన్షు. అన్షు అంటే ఎవరు అంత గుర్తుపట్టరు కానీ.. మన్మథుడు హీరోయిన్ అంటే ఇలాగే గుర్తు పట్టేస్తారు. ఇక తన అందంతో అప్పట్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2002లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అన్షు 2005లోనే ఇండస్ట్రీకి దూరమైంది. ఇక కన్నడ సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏం చేస్తుందో తెలుసా..
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. తన అందం తో మరింత మెప్పించింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమా లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేదు. మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.
లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. తనకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. ఇక సోషల్ మీడియాతో అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లండన్ లో సెటిల్ అవగా.. అక్కడే ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తుందట. అక్కడ ఆమెకు ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాపు కూడా ఉందట.
heroine anshu
టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ లు వేసుకునే దుస్తులను తిరిగి మళ్లీ డిజైనింగ్ చేయించి తిరిగి సేల్ చేస్తుందట. ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీకి దూరమై 18 ఏళ్లవ్వగా తిరిగి మళ్ళీ ఇండస్ట్రీకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి ఇప్పటివరకు మళ్లీ ఇటువంటి ప్రకటనలు రాకపోగా ఈమె రీ ఎంట్రీ కోసం అభిమానులు బాగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.