NAGARJUNA FUNNY INCIDENT WITH ANCHOR RAVI START MUSIC LATEST PROMO RELEASED MNJ
Nagarjuna- Ravi: నాగార్జునకు రవి బిస్కెట్.. పక్కకెళ్లు అంటూ యాంకర్‌కి హ్యాండ్ ఇచ్చిన కింగ్
నాగార్జున యాంకర్ రవి
Nagarjuna- Anchor Ravi: వైల్డ్ డాగ్ చిత్రంతో ఏప్రిల్ 2న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు కింగ్ నాగార్జున. భారతదేశంలో జరిగిన ఓ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా.. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాపై అటు నాగార్జున అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచారు నాగ్.
Nagarjuna- Anchor Ravi: వైల్డ్ డాగ్ చిత్రంతో ఏప్రిల్ 2న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు కింగ్ నాగార్జున. భారతదేశంలో జరిగిన ఓ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా.. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాపై అటు నాగార్జున అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచారు నాగ్. పలువురికి ఇంటర్వ్యూలు ఇస్తూ పలు షోలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టార్ మాలో సుమ వ్యాఖ్యతగా చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్‌లో పాల్గొన్నారు నాగార్జున. ఇందులో నాగార్జునతో పాటు హీరోయిన్ సాయామీ ఖేర్, యాంకర్ రవి, యాంకర్ శ్యామల, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా, యాంకర్ గీతా భగత్, యాంకర్ మంజూష, యాంకర్ వింధ్య పాల్గొన్నారు. ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. అందులో నాగార్జున గారి హార్ట్‌లో అరెస్ట్ అయ్యాను అంటూ రవి రాగానే బిస్కెట్ వేశాడు.
ఇక ఈ ప్రోమోలో నాగార్జున కూడా అదరగొట్టేశారు. అందరితో కలిసి స్టెప్పులు వేస్తూ రచ్చ చేశారు. ఇక నాగార్జున టీమ్‌లోని రవి, అవతలి టీమ్‌లోని అలీ రెజాను వెక్కిరించి రాగా.. అతడు గన్ పట్టుకొని రవి దగ్గరకు వస్తాడు. అప్పుడు రవి.. సర్ మీ వాళ్లు వైల్డ్ డాగ్‌లా కాదు, స్ట్రీట్ డాగ్‌లా ఉన్నారు అని కామెంట్ చేశాడు. ఇక లేడి యాంకర్లు గన్లను పట్టుకోగా.. మీకు పట్టుకోవడం రావడం లేదంటూ వారి దగ్గరకు వెళ్లి చూపించారు నాగార్జున. ఆ సమయంలో తనకు కూడా చూపించాలంటూ యాంకర్ రవి గన్ తీసుకొని రాగా.. పక్కకెళ్లు అంటూ నవ్వుతూ సైగ చేశాడు కింగ్. వినోదాత్మకంగా వచ్చిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వైల్డ్ డాగ్లో దియా మీర్జా, సాయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, అవిజిత్ దత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అశిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా గత రెండేళ్లుగా పెద్దగా హిట్లు లేని నాగార్జున.. ఈ మూవీతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. ఇక అదే రోజు కార్తి, రష్మిక మందన్న నటించిన సుల్తాన్ కూడా విడుదల అవ్వబోతుంది. అయితే అదే రోజున విడుదల కావాల్సిన గోపిచంద్ సిటీమార్ మూవీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.