Bigg Boss : బిగ్‌బాస్ (Bigg Boss) ప్రోగ్రామ్‌కు ఆఫ్ఠనిస్తాన్ (Afghanistan) తాలిబన్ల(Taliban)కు ఉన్న సంబంధం ఏమిటా ఆశ్యర్యపోతున్నారా .. వివరాల్లోకి వెళితే.. మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఈ నెల 15న మన దేశ స్వాతంత్య్ర దినాన ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. పంద్రాగష్టున తాలిబన్లు దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన వెంటనే.. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అప్ఘాన్ విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈయన యూఏఈ (UAE)లో తలదాచుకుంటున్నారు. తాలిబన్ల రాక.. అష్రఫ్ ఘనీ పరారీతో .. ఆప్ఘనిస్తాన్‌లో అరాచక పరిస్థితులు దాపురించాయి. తాలిబన్ల రాక్షస పాలనను తలచుకొని.. చాలా మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. భారత్, అమెరికా, కెనడా, యూకే సహా పలు దేశాలకు శరణార్థులుగా తరలి వెళ్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇప్పటికీ అప్ఘన్ పౌరుల తరలింపు కొనసాగుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే.. ఆఫ్ఠనిస్తాన్కు తెలుగులో ప్రసారమయ్యే బిగ్‌బాస్ ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌కు సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే.. తెలుగు బిగ్‌బాస్ షోను గత రెండు పర్యాయాలు హోస్ట్ చేసిన నాగార్జున (Nagarjuna).. మూడోసారి ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సెప్టెంబర్ 5న ప్రసారం కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున .. అప్పట్లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachcchan),శ్రీదేవి (Sridevi) హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఖుదా గవా’ (Khuda Gawah) సినిమాలో రెండో హీరోగా నటించిన సంగతి తెలిసిందే కదా.‘ఖుదా గవా’ అంటే తెలుగులో దేవుడి సాక్ష్యం అని అర్ధం.
ప్రముఖ నటుడు టినూ ఆనంద్ సోదరుడు ముకుల్ ఎస్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ సినిమాను అఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ బాద్షా ఖాన్ అనే అఫ్ఘన్ పఠాన్‌గా నటించారు. మరోవైపు నాగార్జున ఈ సినిమాలో రజా మీర్జా పాత్రలో అలరించారు. ఈ సినిమాను ఎక్కువగా అఫ్ఘనిస్తాన్‌లో పిక్చరైజ్ చేసారు. ఈ సినిమాలో దాదాపు 80 శాతం సన్నివేశాలు అఫ్ఘనిస్తాన్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు భార్య సోదరి నమ్రత శిరోద్కర్ కూడా మరో ముఖ్యపాత్రలో నటించారు.
Happy Birthday Suman : చిరంజీవి, బాలయ్యలకు ఆ విధంగా ముచ్చెమటలు పట్టించిన సుమన్..
మొత్తంగా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేస్తోన్న నాగార్జున ఆ తర్వాత గగనం కూడా అఫ్ఘనిస్తాన్ .. నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక హిందీలో ‘ధర్మాత్మ’, ‘తోర్బాజ్’, ‘ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్’, జానషీన్, ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’, ‘ఏజెంట్ వినోద్’, ‘దష్త్ ఏ మార్గో’, వంటి పలు హిందీ చిత్రాలు తెరకెక్కాయి.
ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..
ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆదివారం నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. దాంతో పాటు తనయుడు నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Amitabh bachchan, Bigg Boss, Bigg Boss 5 Telugu, Bollywood news, Nagarjuna Akkineni, Taliban, Tollywood