నాగార్జున ఈ మధ్య తెలుగుతో పాటు మిగిలిన భాషలపై కూడా దృష్టి పెట్టాడు. వరసగా హిందీ, తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ హీరో. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర చేస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో నాగ్ పాత్ర షూటింగ్ పూర్తైపోయింది. ఇక ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’ అనే భారీ మల్టీస్టారర్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు మన్మధుడు.
బ్రహ్మస్త్ర సినిమా స్టిల్
సినిమా షూటింగ్ కూడా ఘనంగా మొదలైంది రెండేళ్ల కింద. అయితే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ధనుష్ ఈ సినిమాను ఆపేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం నిర్మాతలు. తేండ్రాల్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేశాడు ధనుష్. అయితే ఇప్పుడు ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆర్థిక సమస్యలతో ఈ మల్టీస్టారర్‌ను ప్రస్తుతానికి ఆపేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తేండ్రాల్ మూవీస్ నుంచి ఆ మధ్య విజయ్ ‘మెర్సల్’ సినిమా వచ్చింది.
నాగార్జున ధనుష్ మల్టీస్టారర్ (nagarjuna dhanush)
ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.. 250 కోట్ల వరకు వసూళ్లు తీసుకొచ్చింది. కానీ ఈ చిత్రం తనకు నష్టాలు తీసుకొచ్చిందని ఈ నిర్మాత చెప్పటం విశేషం. అందుకే ధనుష్ తెరకెక్కించాలనుకున్న మల్టీస్టారర్‌ను పక్కన పెట్టారు. దీనిపై ధనుష్ కూడా ఆశలు వదిలేసుకున్నాడు. ఇక నాగార్జున కూడా వదిలేసాడు. ఇందులో నాగార్జున 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా నటిస్తున్నాడు.
నాగార్జున (Nagarjuna)
రెండేళ్ల కిందే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు ధనుష్. బడ్జెట్ కాస్త తగ్గించి.. మరో నిర్మాతను చూసుకుని నాన్ రుద్రన్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నాడు ధనుష్. అందుకే కాస్త రిస్క్ అయినా పర్లేదు కానీ పూర్తి చేయాలని చూస్తున్నాడు రజినీ అల్లుడు. నాగార్జున కూడా మళ్లీ మొదలైతే నటించడానికి ఇబ్బందేమీ లేదంటున్నాడు. లాక్డౌన్ తర్వాత అన్నీ కుదిర్తే నాన్ రుద్రన్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.