Home /News /movies /

NAGARJUNA CHIRANJEEVI MEGASTAR CHIRANJEEVI A DELICIOUS DINNER COOKED BY THE WILD DOG NAGARJUNA AKKINENI PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA TA

Nagarjuna - Chiranjeevi: ‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి.. సోషల్ మీడియాలో వైరల్..

నాగార్జునకు వంట చేసి పెట్టిన చిరంజీవి (Twitter/Photo)

నాగార్జునకు వంట చేసి పెట్టిన చిరంజీవి (Twitter/Photo)

Nagarjuna - Chiranjeevi: ‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి.. దీినిక సంబంధించిన  ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

    Nagarjuna - Chiranjeevi: ‘వైల్డ్ డాగ్’ నాగార్జునకు వేడి వేడి డిన్నర్ చేసి పెట్టిన చిరంజీవి.. దీినిక సంబంధించిన  ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు కరోనా తర్వాత వీళ్లిద్దరే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉన్నారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కరోనా కారణంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ కాళ్లకు బలపం కట్టుకొని తిరిగిన సంగతి తెలిసిందే కదా. తాజాగా చిరంజీవి.. నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్‌లో భాగంగా నాగ్‌కు స్వయంగా తన చేతులతో ఓ వంటకం చేసి నాగార్జునకు రుచి చూపించాడు.

    ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. మెగాస్టార్ తనకు హాట్ డెలిషియస్ డిన్నర్ చేసి పెట్టిన పిక్‌ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


    ఇదంత నాగార్జున.. వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా విజయం నాగార్జునకు అత్యంత కీలకం అనే చెప్పాలి. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా తర్వాత నాగార్జున ఇప్పటి వరకు సక్సెస్ అందుకోలేదు. ఈ సినిమా పై నాగార్జున భారీ ఆశలే పెట్టుకున్నాడు. ‘వైల్డ్ డాగ్’ సినిమా విషయానికొస్తే దేశభక్తి  నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. డిపార్టెమెంట్‌లో అందరు అతన్ని ‘వైల్డ్ డాగ్’ (అడివి కుక్క) అని పిలుస్తుంటారు. మన దేశంలో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేసాడు నాగార్జున. ముందుగా ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ కావడంతో మనసు మార్చుకున్నారు నిర్మాతలు. మరికొన్ని గంటల్లో  విడుదల కాబోతున్న ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ దగ్గర నిజంగా వైల్డ్ డాగ్‌గా బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Nagarjuna Akkineni, Tollywood, Wild Dog Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు