• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGARJUNA BLOCK BLUSTER DUAL ROLE HELLO BROTHER MOVIE HERO SRIKANTH PLAYED NAG DUPE ROLE HERE ARE THE DETAILS TA

Nagarjuna: ‘హలో బ్రదర్’ మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..

Nagarjuna: ‘హలో బ్రదర్’ మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..

నాగార్జున (File/Photo)

Nagarjuna Akkineni Helo Brother Movie | నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో నటించాడు.ఈ చిత్రంలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరంటే..

  • Share this:
    Nagarjuna Akkineni Helo Brother Movie | నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’ చిత్రానికి  ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో బిగ్‌బాస్ షో వేదికగా నాగార్జున ఈ సినిమాలో తన డూప్‌గా ఎవరు నటించారానే విషయమై ఈ షోలో వెల్లడించాడు. ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున రెండు సీన్లలో కనిపించే సన్నివేశాల్లో హీరో శ్రీకాంత్ తనకు డూప్‌గా నటించినట్టు నాగార్జున ఆ షోలో వెల్లడించాడు. ఇక హీరోగా శ్రీకాంత్‌కు ఇ.వి.వి. సత్యనారాయణతో మంచి అనుబంధం ఉంది. అంతకు ముందు శ్రీకాంత్ ఇ.వి.వి.సత్యనారాయణ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘వారసుడు’ సినిమాలో నటించాడు. ఆ అనుబంధంతోనే నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లో నాగార్జున.. ఇద్దరుగా కనిపించే సన్నివేశాల్లో ఆయనకు డూప్‌గా  నటించాడు శ్రీకాంత్.

    ఇద్దరి హైట్‌తో పాటు పర్సనాలిటీ ఒకే రకంగా ఉండటంతో ఇ.వివి.సత్యనారాయణ.. శ్రీకాంత్‌ను నాగార్జున డూప్‌గా ‘హలో బ్రదర్’ సినిమాలో నటింపచేసాడు. హీరో శ్రీకాంత్.. నాగార్జున హీరోగా నటించిన ‘వారసుడు’ సినిమాతో పాటు ప్రెసిడెంట్ గారి పెళ్లాం, నిన్నే ప్రేమిస్తా వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

    Nagarjuna Block Bluster Dual Role hello brother movie hero srikanth played Nag Dupe Role Here Are The Details, Nagarjuna: ‘హలో బ్రదర్’ మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..,nagarjuna,nagarjuna akkiineni,hello brother,hello brother dupe srikanth,srikanth,hello brother srikanth dupe,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, శ్రీముఖి,బిగ్ బాస్ 3, విన్నర్, బిగ్ బాస్ త్రీ విన్నర్, బిగ్ బాస్ 3 విన్నర్, విన్నర్ శ్రీముఖీ, శ్రీముఖి ఫోన్ నంబర్, విన్నర్ శ్రీముఖి,హలో బ్రదర్,హల్ బ్రదర్‌లో నాగార్జున డూప్‌గా శ్రీకాంత్,నాగార్జున శ్రీకాంత్
    నాగార్జున,శ్రీకాంత్ (File/Photo)


    మరోవైపు నాగార్జున.. ‘హలో బ్రదర్’ సినిమా తర్వాత ‘ఎదురులేని మనిషి’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించారు. హలో బ్రదర్ సినిమాలో కవల సోదురులుగా నటించిన నాగార్జున.. ‘ఎదురులేని మనిషి’ సినిమాలో ఏజ్ గ్యాప్ ఉన్న అన్నదమ్ములుగా నటించారు. ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో మాత్రం తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించారు. నాగార్జున పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ‘జానకి రాముడు’, ‘మనం’ సినిమాల్లో రెండు పాత్రల్లో నటించినా.. అది పూర్తి స్థాయి డ్యూయల్ రోల్‌గా పరిగణించలేము. ఇంకోవైపు  నాగార్జున.. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలో హీరోయిన్ మీనా కోసం మరో నాగార్జున ఉన్నట్టు చూపిస్తారు. ఏమైనా అఫీషియల్‌గా నాగార్జున.. తన కెరీర్ మొత్తంలో మూడు సినిమాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో కనిపించడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు