Home /News /movies /

NAGARJUNA BIGG BOSS HOSTING COLORS SWATHI MADE SENSATIONAL COMMENTS ON NAGARJUNA HOSTING TA

Nagarjuna: నాగార్జున హోస్టింగ్ పై కలర్స్ స్వాతి సంచలన వ్యాఖ్యలు..

నాగార్జున, కలర్స్ స్వాతి (Twitter/Photo)

నాగార్జున, కలర్స్ స్వాతి (Twitter/Photo)

Nagarjuna - Colors Swathi | నాగార్జున హోస్టింగ్ పై కలర్స్ స్వాతి సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే

    Nagarjuna - Colors Swathi | నాగార్జున హోస్టింగ్ పై కలర్స్ స్వాతి సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్  సీజన్ 4‌ ముగిసిపోయింది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 కోసం అపుడే ప్రిపేరేషన్స్ జరుగుతున్నాయి. సీజన్ 3తో పాటు సీజన్ 4ను నాగార్జున ఎంతో ఆసక్తికరంగా మలిచాడు. మధ్యలో బిగ్‌బాస్ షోలో కాస్త తడబడ్డ మొత్తంగా  బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున పర్వాలేదనిపించాడు. ఆ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొడుకులిద్దరు హీరోలైన ఇప్పటికే 60 ఏళ్ల పై పడిన వయసులో యువకుల వలే ఫిజిక్ మెయింటెన్ చేయడంతో పాటు తన అబ్బాయిలకు సినిమాల విషయంలో పోటీ ఇస్తూ.. నిజంగా అసలుసిసలైన మన్మథుడి అనిపించుకున్నాడు. అంతేకాదు టీవీ తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు, ఆ తర్వాత బిగ్‌బాస్ హోస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు.

    ిక బిగ్‌బాస్ షోను నాగార్జున అత్యంతం తన వాక్చాతుర్యంతో అదరగొట్టాడు. నాగార్జన యాంకరింగ్‌కు సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. తాజాగా నాగార్జున యాంకరింగ్ పై సినీ హీరోయిన్ కలర్స్ స్వాతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ర చేసింది.  రీసెంట్‌గా కలర్స్ స్వాతి.. సుమ యాంకరింగ్‌గా వ్యవహరిస్తోన్న క్యాష్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్బంగా సుమ మాట్లాడుతూ.. నాగార్జున హోస్టింగ్ బాగుంటుందా .. సుమ హోస్టింగ్ బాగుంటుందా అనే ప్రశ్నకు కలర్స్ స్వాతి.. సుమ హోస్టింగ్ బాగుంటుందని చెప్పింది. దీంతో వెంటనే సుమ కలగ జేసుకొని బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ సుమ, నాగార్జున హోస్టింగ్స్ గురించి కలర్స్ స్వాతి ఏమందో తెలిస్తే షాక్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది. నాగార్జున గారు మీకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్ అంటూ సుమ చెప్పడం షోలో నవ్వులు పూయించింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anchor suma, Bigg Boss, Colors swathi, Nagarjuna Akkineni, Tollywood

    తదుపరి వార్తలు